ఇస్మార్ట్ బ్యూటీకి ఈసారైనా హిట్ దక్కేనా?
మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 April 2025 3:15 AMమోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో అమ్మడు చేసిన మొదటి సినిమా ఈ మాయ పేరేమిటో. కానీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కావ్య ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే ఏడేళ్లు అవుతుంది. కానీ స్టార్‌డమ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
ఈ మాయ పేరేమిటో తర్వాత ఏక్ మినీ కథ సినిమా చేసి ఆ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి మంచి హిట్ అందుకుంది. ఏక్ మినీ కథ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న కావ్య తెలుగుతో పాటూ తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ కావ్యకి పెద్దగా కలిసి వచ్చింది మాత్రం ఏం లేదు.
దీంతో టాలీవుడ్‌నే నమ్ముకుని కావ్య సినిమాలు చేస్తూ వస్తోంది. రెండేళ్ల ముందు వరకు ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ వచ్చిన కావ్య, గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు చేసింది. మాస్ మహారాజ రవితేజతో ఈగల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చి ఊరు పేరు భైరవకోన, రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్, గోపీచంద్ తో కలిసి విశ్వం సినిమా చేసింది.
గతేడాది కావ్య నుంచి వచ్చిన నాలుగు సినిమాల్లో ఊరు పేరు భైరవకోన సినిమా తప్పించి మిగిలినవన్నీ డిజాస్టర్లుగానే నిలిచాయి. ఈ హ్యాట్రిక్ డిజాస్టర్లు కావ్య కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించింది. దీంతో అమ్మడికి ఆఫర్లు రాలేదు. ఆఫర్లు రాక కెరీర్లో గ్యాప్ తీసుకున్న కావ్య వెకేషన్ కు వెళ్లి మళ్లీ రీసెంట్ గానే తిరిగొచ్చింది.
వెకేషన్ నుంచి వచ్చిన కావ్య ఇప్పుడు తిరిగి సినిమాలపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే కావ్య ఓ సినిమాకు కమిటైనట్టు టాక్ వినిపిస్తుంది. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేయనున్న అప్‌కమింగ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా కావ్య ఎంపికైనట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లినట్టు సమాచారం. మరి ఈ సినిమా అయినా కావ్య కు అనుకున్న ఫలితాన్నిస్తుందేమో చూడాలి.