Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ విన్నర్ 250 కోట్లతో సినిమానా?

అయితే బిగ్ బాస్ లో విన్నర్ అయిన వారెవరికి కెరియర్ పరంగా ఆ ఫేమ్ ఉపయోగపడలేదు

By:  Tupaki Desk   |   27 Dec 2023 12:30 AM GMT
బిగ్ బాస్ విన్నర్ 250 కోట్లతో సినిమానా?
X

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాక్టర్ కౌశల్ మండా తన పాపులారిటీతో ఊహించని విధంగా టైటిల్ విన్నర్ అయ్యారు. కౌశల్ ఆర్మీ పేరుతో లక్షల మంది యూత్ అతని గెలుపు కోసం పనిచేశారు. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కొంతకాలం కొనసాగింది.

ఆ టైంలో స్టార్ హీరో రేంజ్ లో కౌశల్ చరిష్మా నడిచేది. దానికి తగ్గట్లుగానే చాలా మంది నిర్మాతలు కౌశల్ తో మూవీస్ చేయడానికి ముందుకొచ్చారనే ప్రచారం జరిగింది. కొన్ని సినిమాలు లాంచింగ్ కూడా అయ్యాయి అన్నట్లు సోషల్ మీడియాలో హడావుడి చేశారు. తరువాత ఏమైందో ఆ సినిమాలపై సౌండ్ వినిపించలేదు. అయితే కౌశల్ రెమ్యునరేషన్ కోట్లలో డిమాండ్ చేయడంతోనే నిర్మాతలు అతనితో ప్లాన్ చేసిన సినిమాలు ఆపేసినట్లు కూడా మరికొందరు ప్రచారం చేశారు.

అయితే బిగ్ బాస్ లో విన్నర్ అయిన వారెవరికి కెరియర్ పరంగా ఆ ఫేమ్ ఉపయోగపడలేదు. బిగ్ బాస్ సీజన్ 1కి శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ తర్వాత శివబాలాజీ కెరియర్ డౌన్ ఫాల్ అయ్యింది. రాహుల్ సిప్లిగంజ్ సీజన్ 3 విన్నర్ అయ్యారు. కొద్దిలో కొద్దిగా రాహుల్ తన టాలెంట్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు తప్ప బిగ్ బాస్ అదనంగా తీసుకొచ్చిన మైలేజ్ ఏమీ లేదు.

తరువాత అభిజిత్, రేవంత్, వీజే సన్నీ, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్స్ గా నిలిచారు. వీరిలో వీజే సన్నీ బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక ఓ మూడు సినిమాలు చేశారు. ఏవీ చెప్పుకోదగ్గ హిట్స్ కాలేదు. అయితే కౌశల్ మండా మాత్రం ఇప్పటికి తన కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. కచ్చితంగా హీరోగా సక్సెస్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ త్వరలో ఓ 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో హీరోగా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

నాతో పాటు ప్రతి భాష నుంచి ఒక స్టార్ హీరో ఆ సినిమాలో చేయబోతున్నారని అన్నాడు. త్వరలో ఆ మూవీకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెప్పారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా రన్నింగ్ లో ఉన్నాయని కౌశల్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అతనిపై ట్రోల్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. బహుశా సినిమా టైటిల్ 250 కోట్లు అయ్యి ఉంటుందని సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా కౌశల్ ఇంకా అదే కాన్ఫిడెన్స్ ఉండడం విశేషం. మరి ఇప్పుడు కూడా అతని మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి.