అవకాశం పేరిట మునగచెట్టుక్కిస్తారంతే!
కౌశల్ పరిచయం అసవరం లేని పేరు. `బిగ్ బాస్` కంటే ముందే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు సీరియల్స్ చేసారు
By: Tupaki Desk | 12 July 2025 7:00 PM ISTకౌశల్ పరిచయం అసవరం లేని పేరు. `బిగ్ బాస్` కంటే ముందే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు సీరియల్స్ చేసారు. సీరియళ్ల నుంచే సినిమాల్లోకి వచ్చాడు. కానీ సినిమాల పరంగా చెప్పుకోదగ్గ పాత్రలు కౌశల్ కు పడలేదు. హీరోయిక్ లుక్ ఉన్నా? అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అటుపై కొంత కాలానికి బిగ్ బాస్ రావడంతో మరింత ఫేమస్ అయ్యాడు. ఓ సీజన్ లో ఏకంగా విజేతగాను మారాడు. దీంతో జనాల్లో అదరణ కూడా పెరిగింది.
క్రేజీ స్టార్ గా మారాడు. దీంతో అప్పటి వరకూ నటుడిగా సాధించలేనిని బిగ్ బాస్ విజేతగా పరిశ్రమలో సాధించాలనుకున్నాడు. నాని హీరో కూడా హౌస్ వదిలి వచ్చిన తర్వాత నీ రేంజ్ మారిపోతుందని ఎంతో నమ్మకాన్ని కల్పించారు. ఆయనే కాదు కౌశల్ తో కాస్తా కూస్తో పరిచయం ఉన్న ఇండస్ట్రీ వాళ్లంతా ఇలాంటి భరోసా కల్పించారు. కానీ మాటలు కోటలు దాటడం తప్ప ఎలాంటి అవకాశాలు రాలేదని కౌశల్ క్లారిటీ ఇచ్చేసాడు. ఇవన్నీ మునగ చెట్టు ఎక్కించే మాటలు తప్ప తనని పిలిచి ఎవరూ అవకాశం ఇవ్వలేదన్నాడు.
విజేతగా బయటకు వెళ్లిన తర్వాత కనిపించిన ప్రతీ ఒక్కరూ నీకేం పెద్ద స్టార్ అవుతాయ్ అని దర్శక, నిర్మాతలు చాలా మంది చెప్పారుట. కానీ చెప్పిన వాళ్లెవ్వరు కూడా తనకు ఒక చిన్న రోల కూడా ఇవ్వ లేదన్నారు. అలాగే పూరి జగన్నాధ్ ని ఓ సారి సినిమా ఛాన్స్ అడిగితే నీకు తగ్గ రోల్ లేదు. చిన్న చితకా పాత్రలు వేస్ట్. నీకు తగ్గ రోల్ ఉంటే దానికి న్యాయం జరుగుతుందన్నారుట. పూరి డైరెక్టర్ చేసిన `బద్రీ` సినిమాకు కూడా తానే కాస్టింగ్ చేసానని కౌశల్ గుర్తు చేసాడు.
అప్పటి నుంచి పూరితో పరిచయం ఉన్నా? ఆయన కూడా ఛాన్స్ ఇవ్వలేదన్నారు. ఇంకా ఇలాంటి మాట లు చాలా మంది చెప్పారని గుర్తు చేసుకున్నాడు. బిగ్ బాస్ వల్ల తనకు ఏం ఒరగలేదన్నాడు. బిగ్ బాస్ క్రేజ్ అన్నది అక్కడికే పరిమితం తప్ప అంతకు మించి సాధించింది ఏమీ లేదన్నాడు. అలా ఉంది మార్కెట్ లో బిగ్ బాస్ క్రేజ్.
