Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : కత్రీనా ఒంటిపై సింగిల్ టవల్‌.. ఏం జరుగుతోంది?

కొత్తగా వచ్చే ముద్దుగుమ్మలతో ఈ అమ్మడు తన అందంతో పోటీ పడుతున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది

By:  Tupaki Desk   |   6 Nov 2023 12:05 PM GMT
పిక్ టాక్‌ : కత్రీనా ఒంటిపై సింగిల్ టవల్‌.. ఏం జరుగుతోంది?
X

టాలీవుడ్‌ లో మల్లీశ్వరి సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ అమ్మడు నాలుగు పదుల వయసులో కూడా యంగ్‌ హీరోలతో మరియు హీరోయిన్స్ తో పోటీ పడుతూ ఉంది. కొత్తగా వచ్చే ముద్దుగుమ్మలతో ఈ అమ్మడు తన అందంతో పోటీ పడుతున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.


ఈ అమ్మడు త్వరలో విడుదల కాబోతున్న టైగర్‌ 3 సినిమాలో నటించిన విషయం తెల్సిందే. దీపావళి సందర్భంగా విడుదల అవ్వబోతున్న టైగర్‌ 3 సినిమాలో కత్రీనా కైఫ్‌ చేసే టవల్‌ ఫైట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ట్రైలర్‌ విడుదల అయినప్పటి నుంచి కూడా కత్రీనా టవల్‌ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ మరియు ఫోటోలు సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి.

టవల్‌ ఫైట్ విజువల్స్ తోనే సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు అంటూ కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి టవల్‌ ఫైట్‌ వెనుక జరిగిన వర్కౌట్స్ ని కత్రీనా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. యాక్షన్‌ సన్నివేశాల కోసం హీరోయిన్స్ ఎక్కువ రిస్క్‌ తీసుకోరు.. అలాగే ఎక్కువ షాట్స్ లో డూప్‌ లను వినియోగిస్తారు. కానీ కత్రీనా చాలా వర్కౌట్‌ లు చేసి యాక్షన్‌ సన్నివేశాల్లో నటించినట్లుగా తెలుస్తోంది.

తాను పడ్డ కష్టం గురించి వివరిస్తూ సినిమా విడుదల తర్వాత కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్నట్లుగా ఆమె పేర్కొంది. అదే సమయంలో మరోసారి టవల్ ఫైట్‌ కి సంబంధించిన ఈ ఫోటోను షేర్‌ చేసింది. నెటిజన్స్ విమర్శిస్తున్నట్లుగానే టైగర్ 3 ని టవల్‌ ఫైట్‌ తో ప్రమోట్‌ చేస్తున్నారు అనిపిస్తోంది.