Begin typing your search above and press return to search.

చెన్నై సూప‌ర్ కింగ్స్ బాధ్య‌తలు క్యాట్ చేతికి!

2024 ఐపీఎల్ కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుంచి మే వ‌ర‌కూ మ‌ళ్లీ హంగామా షురూ కాబోతుంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:56 AM GMT
చెన్నై సూప‌ర్ కింగ్స్ బాధ్య‌తలు క్యాట్ చేతికి!
X

2024 ఐపీఎల్ కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుంచి మే వ‌ర‌కూ మ‌ళ్లీ హంగామా షురూ కాబోతుంది. ఇప్ప‌టికే టీమ్ లు అన్ని కొత్త బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ను నియ‌మించుకునే ప‌నిలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ని నియ‌మించుకుంది. దీంతో ఈ ఏడాది క‌త్రినా మెరుపులు చెన్నై త‌రుపున షురూ కాబోతున్నాయ‌ని తెలుస్తోంది.


టీవీ యాడ్స్ తో పాటు గ్యాల‌రీలోనూ క‌త్రినా వెనుకుండి చెన్నై టీమ్ ని ప్రోత్స‌హించ‌నుంది. అతి త్వ‌ర లోనే చెన్నై ఆట‌గాళ్ల‌తో క‌త్రినా యాడ్ షూట్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇన్నో వేటివ్ ఈ యాడ్ డిజైన్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. పైగా ఈ ఐపీఎల్ ధోనికి చివ‌రిది కావ‌డంతో స్పెష‌ల్ గా నిలిచే లా నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ చెన్నై టీమ్ కి సెల‌బ్రిటీలు ఎవ‌రూ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌లేదు.

కానీ ఈసారి ఏకంగా చెన్నై టీమ్ కోసం నార్త్ నుంచి క్యాట్ దిగి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో ఈసారి చెన్నై సూప‌ర్ కింగ్స్ నుంచి చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కత్రినా కైఫ్ ఇప్ప‌టికే జాతీయ విమాన‌యాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. 2023 నుంచి అమ్మ‌డు ఆసంస్థ‌ని ప్ర‌మోట్ చ‌స్తోంది. అలాగే యూఏయి జాతీయ విమాన‌యాన సంస్థ అయిన‌ ఎతిహాద్ ఎయిర్‌వేస్ చెన్నై సూపర్ కింగ్స్ లో భాగ‌స్వామ్యం ఉంది.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు ఎయిర్ వేస్ క‌త్రినా చెన్నై టీమ్ కోసం రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్నం చందంగా క‌త్రినాతో అటు చెన్నై టీమ్ ని..ఇటు విమాన‌యాన సంస్థ‌ని రెండి టిని ఐపీఎల్ వేదిక‌గా క‌లిపి ప్ర‌మోట్ చేసుకుంటుంద‌ని తెలుస్తోంది. స‌ద‌రు జాతీయ విమాన‌యాన సంస్థ పేరు ఇప్పుడు కొత్త‌గా జెర్సీ పై మెర‌వ‌నుంది.