Begin typing your search above and press return to search.

కత్రినా బోల్ట్​ టవల్ ఫైట్​.. ఇదొక్కటి చాలు..

ఈ బోల్డ్ ఫైటింగ్ స్టైల్​ సీక్వెన్స్​ సినిమాపై మరింత హైప్​ను పెంచడంతో పాటు ఓ స్పెషల్ ఇంట్రెస్ట్​ను నెక్స్ట్​ లెవల్​కు తీసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 11:50 AM GMT
కత్రినా బోల్ట్​ టవల్ ఫైట్​.. ఇదొక్కటి చాలు..
X

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సల్మాన్‌ ఖాన్‌ - కత్రినా కైఫ్‌ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'టైగర్‌ 3' ట్రైలర్ వచ్చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రచార చిత్రంలో సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు, కత్రిన చేసిన బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ అదరహో అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా కత్రిన టవల్ ఫైట్ బాగా హైలైట్​ అయి...​ నెట్టింట్లో మరింత ట్రెండింగ్​​ అవుతోంది.


వివరాళ్లోకి వెళితే.. ఈ సినిమాలో కత్రినా కైఫ్ మాజీ పాకిస్థానీ యువతిగా​ జోయా అనే పాత్ర పోషించింది. పలు యక్షన్ సీన్స్​లోనూ కనిపించింది. అయితే ఎక్కువగా ట్రైలర్​లో​ 5 సెకన్ల పాటు కొనసాగిన కత్రిన టవల్​ సెగ్మెంటే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. ఇందులో బాత్ టవల్స్​ ధరించిన ఉన్న కత్రిన సహా మరో లేడీ.. ఇద్దరు ఫైటింగ్ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్​ను మరొకరు లాగేసుకున్నట్లుగా చూపించారు. ఫైనల్​గా ఈ ఇద్దరూ తమ నేక్డ్​ బాడీని కవర్​ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ స్టైల్​ సీక్వెన్స్​ సినిమాపై మరింత హైప్​ను పెంచడంతో పాటు ఓ స్పెషల్ ఇంట్రెస్ట్​ను నెక్స్ట్​ లెవల్​కు తీసుకెళ్లింది.

ఇది చూసిన నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సీన్​ కోసమైనా సినిమాను బిగ్​ స్క్రీన్​పై తప్పకుండా చూస్తామని అంటన్నారు. 'ఈ ఒక్క సీన్ చాలు ట్రైలర్​కు బెస్ట్​ పార్ట్​, కత్రినా టవల్​.. ట్రైలర్​ మొత్తాన్ని డామినేట్​ చేసేసింది', 'సల్మాన్​ ఖాన్​ ఈ సినిమాపై అందరి దృష్టి పడటానికి, తన బాడీని మేకప్​ చేసుకోవడానికి నెలల తరబడి కష్టపడ్డాడు. కానీ కత్రిన సింపుల్​గా ఒక్క టవల్​ సీన్​తో అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుంది', 'ఈ ఒక్క సీన్​ టైగర్​ 3కి రూ.1000కోట్లు పక్కా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది రణ్​బీర్​ కపూర్ గత సినిమాల్లోని ఐకానిక్ టవల్​ సీన్​ను కత్రిన కాపీ చేసిందని' అంటున్నారు.

ఇకపోతే తన జోయ పాత్ర గురించి కత్రినా మాట్లాడుతూ.. "వైఆర్​ఎఫ్​ స్పై యూ నివర్స్​లో జోయానే మొదటి ఫీమేల్​ రోల్​. నాకు ఈ పాత్ర చేసినందుకు గర్వంగా భావిస్తున్నారు. జోయా ఎంతో క్రూరమైనది, ధైర్యవంతురాలు అలానే హృదయం, విధేయత, తనను తాను రక్షించుకోగల ఆత్మస్థైర్యం వంటి లక్షణాలు ఉన్న అమ్మాయి. అన్నింటికన్నా ఆమె ప్రతిసారీ మానవత్వం కోసం నిలబడుతుంది. ఈ పాత్ర కోసం నావంతుగా బెస్ట్ పెర్​ఫార్మెన్స్​ ఇచ్చాను. ఫిజికల్​గా ఈ సినిమా నాకు పెద్ద సవాల్" అని కత్రినా పేర్కొంది.

ఇకపోతే ఈ సినిమాను మనీశ్‌ శర్మ తెరకెక్కించారు. ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై చిత్రాలకు సీక్వెల్‌గా టైగర్​ 3 సిద్ధమవుతోంది. దేశభక్తి నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. దీపావళి కానుకగా నవంబర్‌ 12న ఇది విడుదల కానుంది.