Begin typing your search above and press return to search.

బేబి బంప్‌ని దాచేస్తున్న స్టార్ హీరోయిన్?

అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌తో జామ్ న‌గ‌ర్ జామ్ అయిపోయింది. మూడు రోజుల పాటు సాగిన ఈవెంట్లో అతిర‌థ‌మ‌హార‌థులంతా పాల్గొన్నారు

By:  Tupaki Desk   |   6 March 2024 4:42 AM GMT
బేబి బంప్‌ని దాచేస్తున్న స్టార్ హీరోయిన్?
X

అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌తో జామ్ న‌గ‌ర్ జామ్ అయిపోయింది. మూడు రోజుల పాటు సాగిన ఈవెంట్లో అతిర‌థ‌మ‌హార‌థులంతా పాల్గొన్నారు. ఉత్స‌వాలు ముగిశాక అతిథులు తిరుగుప‌యానమ‌య్యారు. అయితే ఈ ఈవెంట్లో ఒక జంట గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. వేడుకలో క‌త్రిన‌- విక్కీ కౌశ‌ల్ జంట నిగూఢంగా క‌నిపించారు.

జామ్‌నగర్ నుండి ఈ జంట తిరిగి వెళుతున్న క్ర‌మంలో కత్రినా కైఫ్ గర్భవతి అంటూ నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగింది. దానికి కార‌ణం కూడా స్ప‌ష్ఠంగా ఉంది. కత్రినా- విక్కీ 2021లో వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం మూడు సంవత్సరాలుగా సంతోషంగా ఉంది. వారి అభిమానులు ఇద్దరూ శుభవార్త ప్రకటిస్తారని వేచి ఉన్నారు. కొన్ని సార్లు కత్రినా గర్భం గురించిన వార్త‌లు ఆన్‌లైన్‌లో సంద‌డి చేసాయి. కానీ వేటినీ క‌న్ఫామ్ చేయ‌లేదు. అయితే జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌ నుండి క‌త్రిన తిరిగి వెళ‌తుండ‌గా గ‌మ‌నించిన అభిమానులు త‌న‌ గర్భం దాల్చిన సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.

క‌త్రిన‌ జామ్‌నగర్ నుండి తిరిగి వస్తుండగా ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఆరోజు విక్కీ కౌశల్ డెనిమ్ షర్ట్ - జీన్స్‌లో క‌నిపించగా, కత్రినా గులాబీ రంగులో ఉన్న అనంకాళి సెట్‌ను ధ‌రించింది. అయితే త‌న పొట్ట‌ను దుపట్టాతో క‌ప్పుకుంది. పూల ఎంబ్రాయిడరీ డిజైన్ తో ఈ దుప‌ట్టా ఆక‌ర్షించింది. దీంతో దుపట్టాతో కప్పుకున్న తీరు నెటిజనుల‌ దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తమ అభిప్రాయాలను రాశారు. గత కొన్ని రోజులుగా దీపికా పదుకొనే, వరుణ్ ధావన్ , యామీ గౌతమ్ వంటి సెలబ్రిటీలు తమ అభిమానులను శుభవార్తతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండ‌గా, ఇప్పుడు కత్రినా కూడా గర్భవతి అవుతోంది! అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోకి ప్రతిస్పందిస్తూ ఒక నెటిజ‌న్ ``యే బి ప్రెగ్నెంట్ హై ఎల్‌జితా హై`` అని రాశారు. ఆమె గర్భవతిగా ఉన్నట్లు కనిపిస్తోంది ..దానిని త్వరలో ప్రకటించబోతున్నారు అని వేరొక‌రు రాసారు.

ఇటీవ‌ల‌ ఒక ప్రముఖ దినపత్రికతో ఇంటరాక్షన్‌లో విక్కీ కౌశల్ తన గురించి కొన్ని కొత్త విష‌యాల‌ను వెల్లడించాడు. తన ఫోన్ వాల్‌పేపర్‌లో కత్రినా కైఫ్ చిన్ననాటి ఫోటో ఉందని అతను తన అభిమానులతో అన్నారు. అయితే ఇలాంటి ప్రకటన అందర్నీ విస్మయానికి గురి చేసింది. కొంద‌రు నెటిజన్లు కత్రినా గర్భవతిగా ఉన్నారా? వారిద్దరు తమ చిన్నారి కోసం ఎదురు చూస్తున్నారా? అని ఆలోచించడం ప్రారంభించారు. మరికొందరు విక్కీకి కుమార్తె పుట్టాలని ఆకాంక్షించారు.