Begin typing your search above and press return to search.

హ‌బ్బీ హ‌గ్ లో క్యాట్ ఎంత అందంగా అంటే?

ఈ జోడీ సోష‌ల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   4 March 2024 7:18 AM GMT
హ‌బ్బీ హ‌గ్ లో క్యాట్ ఎంత అందంగా అంటే?
X

విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ దంప‌తుల ధాంప‌త్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. సినిమా-ఫ్యామిలీ లైఫ్ ని ప‌క్కాగా ప్లాన్ చేసుకుని బ్యాలెన్స్ గా ముందుకెళ్తున్నారు. ఖాళీ స‌మ‌యం దొరికితే ఎంచ‌క్కా రెక్క‌లు క‌ట్టుకుని విదేశాల‌కు ఎగిరిపోతున్నారు. ఓ ప‌ది రోజులు వెకేష‌న్ మోడ్ ని ఆస్వాదించి తిరిగొచ్చి మ‌ళ్లీ షూటింగ్ ల్లో బిజీ అవుతున్నారు. కెరీర్ ప‌రంగా వెన‌క్కి తిరిగి చూసుకునే ప‌నిలేదు. అవ‌కాశాల‌కు ఏమాత్రం కొద‌వ‌లేదు.


ఈ జోడీ సోష‌ల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. దంప‌తులిద్ద‌రు వాళ్ల మ‌ధ్య అన్యోన్య‌త‌ని చాటుతూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ ఇస్తుంటారు. తాజాగా క‌త్రినా హ‌బ్బీ ఒడిలో వాలిపోయిన ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ప‌చ్చ‌ని అందాల్లో క‌త్రినా-విక్కీ కౌశ‌ల్ ఇద్ద‌రు అలా సా యంసంధ్యా వేళ అలా స‌మ‌యాన్ని గడుపుతోన్న స‌న్నివేశాన్ని త‌ల‌పిస్తుంది ఈ పిక్. క‌త్రినా డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో క‌నిపిస్తుంది.


మెడలో చైన్ ...ముఖాన్ని న‌వ్వుతోనూ నింపేసింది. క్యాట్ ఫేస్ లో మునుప‌టి కంటే మార్పులు క‌నిపిస్తు న్నాయి. ఇక విక్కీ కౌశ‌ల్ హెయిర్ పెంచి పోనీ టెయిల్ లో సర్ ప్రైజ్ చేసాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆలుమ‌గ‌ల‌ను చూసి అభిమానులు త‌మ సంతోషాన్ని కామెంట్ రూపంలో తెలియ‌జే స్తున్నారు. మ‌రోవైపు క‌త్రినా గ‌ర్భ‌వ‌తి అన్న ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌త్రినా రూపంలో కొన్ని ర‌కాల మార్పుల‌తో అది నిజ‌మే అన్న ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది.

ఈ ప్ర‌చారాన్ని ఇంత‌వ‌ర‌కూ క‌త్రినా కూడా ఖండించ‌లేదు. అలాగే దంప‌తులిద్ద‌రు తెర‌పై క‌లిసి న‌టించ డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌ర్నీ ఓ రొమాంటిక్ స్టోరీలో చూడాల‌ని అభిమాన‌లు ఆశ‌ప డుతోన్న నేప‌థ్యంలో త‌ప్ప‌కుండా అంటూ ఇటీవ‌లే ప్రామిస్ కూడా చేసారు. దీంతో ఆ జోడీని ఏ ద‌ర్శ‌కుడు తెర‌పై చూపిస్తాడా? అన్న అస‌క్తి అంత‌కంత‌క రెట్టింపు అవుతోంది.