250 కోట్లు.. రేసులో దీపిక వెనక్కి.. కత్రిన ముందుకు!
వ్యాపారం విజయం సాధించాలంటే దానికి చాలా కలిసి రావాలి. డబ్బు పెట్టుబడి పెట్టినా, స్కిల్ ఉన్నా అంతిమంగా లక్ కూడా కలిసి రావాలి.
By: Tupaki Desk | 17 July 2025 10:00 AM ISTవ్యాపారం విజయం సాధించాలంటే దానికి చాలా కలిసి రావాలి. డబ్బు పెట్టుబడి పెట్టినా, స్కిల్ ఉన్నా అంతిమంగా లక్ కూడా కలిసి రావాలి. మంచి బ్రాండ్ నేమ్... ధరల్లో స్థిరత్వం.. కస్టమర్ల ప్రామిస్ కి తగ్గ క్వాలిటీ ఉత్పత్తిని ఇవ్వడంలో రాజీ పడకపోవడం వంటివి ఆ కంపెనీ ఎదుగుదలకు సహకరించే వీలుంటుంది.
కానీ ఇవేవీ లేకపోతే, ఎలా దొరికిపోతారో దీపిక పదుకొనే వ్యాపారాన్ని చూడాలని అంటున్నారు కొందరు. అందాల కత్రిన కైఫ్ తన బ్రాండ్ విలువ 240 కోట్ల రేంజుకు పెంచుకుంటూ వెళితే... దీపిక పదుకొనే బ్రాండ్ కేవలం తొమ్మిది నెలల్లో 25 కోట్లు నష్టపోయింది. దీనికి కారణం అధిక ధరలు. కస్టమర్ ఆశించిన నాణ్యత ఉత్పత్తిలో లేకపోవడం. ఏది ఏమైనా కత్రిన తెలివైన పెట్టుబడులు, నాణ్యమైన ఉత్పత్తితో మార్కెట్ లో లీడర్ గా ఎదిగింది. కానీ ఎన్నో ఆశలతో పెట్టుబడులు వెదజల్లిన దీపిక మాత్రం డీలా పడిపోయింది.
కత్రినా కైఫ్ రూ.240 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ముంబై-లండన్‌లో విలాసవంతమైన ఇళ్లను సొంతం చేసుకోవడమే గాక అత్యద్భుతమైన కార్లను కొనుగోలు చేసింది. ఇటీవల భారత్, జీరో, రాజ్‌నీతి, ఏక్ థా టైగర్ వంటి చిత్రాలతో కెరీర్ పరంగా దూసుకెళుతున్న సమయంలోనే 2019లో తన బ్యూటీ బ్రాండ్ కే బ్యూటీని ప్రారంభించింది. నిజానికి బ్రాండ్‌ను ప్రారంభించడానికి ముందు కత్రినా 2018లో ప్రముఖ రిటైల్ కంపెనీ నైకాతో జాయింట్ వెంచర్‌లో రూ.2.04 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2021 నాటికి ఆ పెట్టుబడి రూ.22 కోట్లకు పెరిగింది. ఇది కత్రినా తెలివైన వ్యాపారం. ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ నైకాతో జాయింట్ వెంచర్‌కు ఈ స్నేహం బలమైన పునాది వేసింది. 2019లో నైకాతో కలిసి బ్రాండ్‌ను స్థాపించింది. ఇది వేగంగా మార్కెట్లో రాజుగా ఎదిగింది.
కృతి సనన్, మసాబా గుప్తా, దీపికా పదుకొనే, మీరా రాజ్‌పుత్ సొంత చర్మ సంరక్షణ ఉత్పత్తులతో బ్యూటీ లేబుల్‌లను ప్రారంభించారు. అయితే ఇవేవీ కత్రినా సక్సెస్ స్థాయికి సరిపోలలేదు. 2024 స్టోరీబోర్డ్18 కథనం ప్రకారం.. దీపికా పదుకొనే 82 డిగ్రీ E 2024 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ. 25.1 కోట్ల నష్టాన్ని చవి చూసింది. దీపిక బ్రాండ్ అధిక ధరలతో పేలవమైన పనితీరుతో నెగెటివ్ ఫలితం ఎదురైందని మార్కెట్ పేర్కొంది.
2025లో అదే నివేదిక ప్రకారం.. కేవలం ఆరు సంవత్సరాలలో కత్రినా బ్రాండ్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాస్మెటిక్ బ్రాండ్లలో ఒకటిగా స్థిరపడింది. ఇది 2025లో రూ. 240 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
