Begin typing your search above and press return to search.

బికినీ ఫోటోలు పంపితే చెల్లి పాత్ర ఇచ్చారు..!

శంకర్ డైరెక్షన్ లో చేయడం ఎంత అదృష్టమో నాకు తెలుసు. అప్పుడు నాది చిన్న వయసు అందుకే భాతీయుడు సినిమాలో అవకాశం కోసం శంకర్ కి బికినీ ఫోటోలు పంపించా.

By:  Tupaki Desk   |   14 Nov 2023 5:22 AM GMT
బికినీ ఫోటోలు పంపితే చెల్లి పాత్ర ఇచ్చారు..!
X

సౌత్ అన్ని భాషల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కస్తూరి. తెలుగులో అన్నమయ్య, పెద్దరికం సినిమాలు చేసిన ఆమె భారతీయుడు సినిమాలో కూడా నటించి మెప్పించింది. సీనియర్ హీరోయిన్ అయిన కస్తూరి తనకు నచ్చని విషయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతుంది. తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు కస్తూరి. ఒక్కోసారి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతాయి. సినిమాలు ఎలా ఉన్నా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో అలరించింది.

రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభం రోజులను గుర్తు చేసుకున్న ఆమె ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ముఖంగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా చేసిన భారతీయుడు సినిమాలో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శంకర్ డైరెక్షన్ లో చేయడం ఎంత అదృష్టమో నాకు తెలుసు. అప్పుడు నాది చిన్న వయసు అందుకే భాతీయుడు సినిమాలో అవకాశం కోసం శంకర్ కి బికినీ ఫోటోలు పంపించా.

ఆ టైం లో రంగీలా రిలీజ్ కానుంది. ఎక్కడ చూసినా సరే ఊర్మిళ గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే ఆమెకు ఛాన్స్ వచ్చింది. చివరకు ఊర్మిళను హీరోయిన్ గా చేసి తనకు కమల్ హాసన్ చెల్లి పాత్ర ఇచ్చారు. శంకర్ సార్ ని ఏంటి ఇలా చేశారు అని అడిగితే సినిమాలో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పడం తో నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అన్నారు కస్తూరి.

తను చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా సోషల్ మీడియాలో వ్యక్తపరచే కస్తూరి సోషల్ మీడియాలో తన మీద కామెంట్ చేసే వాళ్లకు కూడా అదే రేంజ్ లో ఆన్సర్ ఇస్తుంది. కొన్ని విషయాల్లో తనకు రివర్స్ అవుతున్నా తన స్టాండ్ మాత్రం తీసుకుంటుంది కస్తూరి. ప్రస్తుతం భారతీయుడు సినిమా టైం లో తనకు జరిగిన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది కస్తూరి. ఇప్పటికీ ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే నటించడానికి సిద్ధమే అని చెబుతున్న కస్తూరి కెరీర్ లో ప్రయోగాలు చేయలేదన్న వెలితి ఉందని. ఇప్పటికీ సినిమా ఛాన్స్ లు వస్తే తనకు తగిన పాత్రల్లో నటించడానికి రెడీ అంటుంది కస్తూరి. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పూర్తిగా బుల్లితెర మీద ఫోకస్ పెడుతుంది కస్తూరి. ఒకప్పటి హీరోయిన్ అని కస్తూరికి స్మాల్ స్క్రీన్ లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.