Begin typing your search above and press return to search.

4ల‌క్ష‌లు కొట్టేశాడు.. ప‌నిమ‌నిషిపై న‌టి ఫిర్యాదు!

బిగ్ బాస్ 18 ఫేమ్ కాశీష్ కపూర్ సూటిగా మాట్లాడే వ్య‌క్తిగా అంద‌రి దృష్టిలో ప‌డింది. అయితే ఇప్పుడు ఈ న‌టి ఇల్లు దోపిడీకి గురైంది.

By:  Tupaki Desk   |   14 July 2025 9:36 AM IST
4ల‌క్ష‌లు కొట్టేశాడు.. ప‌నిమ‌నిషిపై న‌టి ఫిర్యాదు!
X

బిగ్ బాస్ 18 ఫేమ్ కాశీష్ కపూర్ సూటిగా మాట్లాడే వ్య‌క్తిగా అంద‌రి దృష్టిలో ప‌డింది. అయితే ఇప్పుడు ఈ న‌టి ఇల్లు దోపిడీకి గురైంది. త‌న‌ ఇంటి పనిమనిషి స‌చిన్ కుమార్ రూ. 4 లక్షలు దొంగిలించాడ‌ని ఆరోపించింది. అత‌డిపై కాశీష్ క‌పూర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు సమాచారం.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. బీహార్‌లోని పూర్ణియాకు చెందిన 24 ఏళ్ల కాశీష్ ప్రస్తుతం అంధేరి వెస్ట్‌లోని వీర దేశాయ్ రోడ్‌లోని న్యూ అంబివాలి సొసైటీలో నివసిస్తోంది. సచిన్ ఐదు నెలలుగా ఆమె ఇంట్లో పనిచేస్తున్నాడు. అతడు 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ విధులు నిర్వ‌హించి వెళ్లిపోతుంటాడు.

అయితే ఒక అల్మారా డ్రాయర్‌లో నగదు నిల్వ దోపిడీకి గురైంద‌ని కాశీష్ ఆరోపించారు. తాను దాచి ఉంచిన ఏడు ల‌క్ష‌ల్లో కొంత డ‌బ్బు మాయ‌మైంది. 4.5 ల‌క్ష‌లు క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

డ‌బ్బు క‌నిపించ‌క‌పోయే స‌రికి అత‌డి జేబులను తనిఖీ చేయడానికి కూడా ప్రయత్నించ‌గా, అతడు దానికి అనుమతించలేదు. ఆ తర్వాత రూ. 50వేలు తీసి నా ఇంట్లోకి విసిరేసి పారిపోయాడుని ఫిర్యాదు చేసారు. పోలీసులే అత‌డిని ప‌ట్టుకుని న్యాయం చేయాల‌ని న‌టి కోరుతోంది.

కాశీష్ కపూర్ రియాలిటీ టీవీ రంగంలో చాలా ప్రజాదరణ పొందిన పేరు. స్ప్లిట్స్‌విల్లా సహ పోటీదారు దిగ్విజయ్ రథీతో ఆమెకున్న వైరం కార‌ణంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి స‌భ్యుల‌తో ర‌క‌ర‌కాల వివాదాల కార‌ణంగా కాశీష్ క‌పూర్ పాపుల‌రైంది.