Begin typing your search above and press return to search.

ట్రైలర్ లేని విడుదల వెనుక రహస్యం ఏంటి?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ `క‌రుప్పు` విడుదలకు సిద్ధమవుతోన్న తరుణంలో అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది.

By:  Srikanth Kontham   |   10 May 2026 1:41 PM IST
ట్రైలర్ లేని విడుదల వెనుక రహస్యం ఏంటి?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ `క‌రుప్పు` విడుదలకు సిద్ధమవుతోన్న తరుణంలో అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా? ఇప్పటి వరకు అధికారిక ట్రైలర్‌ను విడుదల చేయకపోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా భారీ చిత్రాలకు నెల రోజుల ముందు నుండే ప్రమోషన్ల హోరు మొదలవుతుంది. కానీ ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ అనుసరిస్తున్న నిశ్శబ్దం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ట్రైలర్ లేకుండా సినిమాను నేరుగా థియేటర్లలోకి తీసుకురావడం లేదా విడుదలకు అతి తక్కువ సమయం ఉన్నప్పుడు ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఓ మిస్టరీ ప్రమోషన్ వ్యూహం కావొచ్చు.

సినిమాలోని కీలక ఘట్టాలను లేదా సూర్య క్యారెక్టర్‌లోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను బయటపెట్టకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఇది ఒక ఓ రకంగా ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంది. అయితే ఈ వ్యూహం అందరినీ ఆకట్టుకోవడం లేదు. సూర్య వంటి గ్లోబల్ రీచ్ ఉన్న నటుడి సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండింగ్ జరగాల్సి ఉండగా ట్రైలర్ లేకపోవడం వల్ల ఆ సందడి కనిపించడం లేదని అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రచార చిత్రాల ద్వారానే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది కాబట్టి విడుదలకు ముందు ఇలాంటి జాప్యం ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ట్రేడ్ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల లేదా గ్రాఫిక్స్ పనులలో జాప్యం జరగడం వల్ల ట్రైలర్ ఆలస్యమవుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. సూర్య ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తారు. `క‌రుప్పు`లో కూడా ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.

మరి ఆ పాత్రలోని పూర్తి ఇంటెన్సిటీని ట్రైలర్‌లో చూపిస్తారా? లేక నేరుగా వెండితెరపైనే సర్‌ప్రైజ్ ఇస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. చిత్ర యూనిట్ మాత్రం ఈ జాప్యాన్ని కావాలనే చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచడానికి లాస్ట్ మినిట్ బ్లాస్ట్ అనే పద్ధతిని అనుసరిస్తున్నారా? అన్న సందేహం క‌లుగుతుంది. అంటే విడుదలకు కేవలం మూడు లేదా నాలుగు రోజుల ముందు అత్యంత ప్రభావవంతమైన ట్రైలర్‌ను విడుదల చేసి ఆ వేడి తగ్గకముందే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది వారి ప్లాన్ కావొచ్చు. ఈ విధానం హాలీవుడ్ , బాలీవుడ్ చిత్రాలకు కొన్నిసార్లు సక్సెస్ ఇచ్చింది. ప్ర‌స్తుతానికి `క‌రుప్పు` ట్రైలర్ ఎదురు చూపులు నెగటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నా? సరైన సమయంలో వచ్చే అద్భుతమైన విజువల్స్ అంచనాలను మళ్ళీ గాడిలోనూ పెట్టగలవు.