Begin typing your search above and press return to search.

తమిళనాడులో అప్పుడే మొదలైన త్రిష హవా!

ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే.. విజయ్ రాజకీయాల్లోకి వస్తానని..ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుంచి త్రిష మీడియా ముందు మరింత యాక్టివ్ గా కనిపించడం మొదలుపెట్టింది.

By:  Madhu Reddy   |   13 May 2026 10:38 AM IST
తమిళనాడులో అప్పుడే మొదలైన త్రిష హవా!
X

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో హీరోయిన్ జంటగా కలిసి రెండు మూడు చిత్రాలలో వరుసగా నటించడం.. లేదా ఆ జంట తరచుగా మీడియా కంట పడడం.. లాంటివి చేస్తే మాత్రం నిజంగా ఆ జంట మధ్య ఏదో తెలియని బంధాన్ని క్రియేట్ చేస్తూ వారిపై రూమర్స్ గుప్పిస్తూ ఉంటారు నెటిజన్స్ . అయితే కొంతమంది సెలబ్రెటీలు ఈ రూమర్స్ పై స్పందిస్తే.. మరికొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు. మరొకవైపు కోలీవుడ్లో రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న త్రిష ,విజయ్ దళపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇద్దరూ కలిసి పలు చిత్రాలలో జంటగా నటించి.. ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.





ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే.. విజయ్ రాజకీయాల్లోకి వస్తానని..ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుంచి త్రిష మీడియా ముందు మరింత యాక్టివ్ గా కనిపించడం మొదలుపెట్టింది. దీంతో విజయ్ రాజకీయ ప్రవేశానికి త్రిష కారణం అనే కామెంట్ కూడా వ్యక్తం అయింది.. అలా విజయ్ టీవీకే పార్టీని స్థాపించి , ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా 108 సీట్లు కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. ఈ పార్టీ విజయం వెనుక త్రిష సక్సెస్ ఉంది అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. అంతేకాదు ఇటు విజయ్ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అంతేకాదు త్రిషకి హోంశాఖ మంత్రిగా అవకాశం ఇస్తారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇంతలోనే విజయ్ ఇక్కడ రెండవ పవర్ స్టార్ వుండరు అంటూ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇంతలోనే తాజాగా జరిగిన పరిణామాన్ని చూస్తే అప్పుడే తమిళనాడులో త్రిష హవా మొదలైంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటి అనే విషయానికి వస్తే.. త్రిష - సూర్య జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం కరుప్పు . ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ప్రత్యేక షోలకు అనుమతి తీసుకోవడానికి కరుప్పు చిత్ర బృందం మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్రత్యేక అనుమతి కావాలి అని ముఖ్యమంత్రిని కోరగా.. దానికి విజయ్ అనుమతి ఇచ్చినట్లు.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న విజయ్ అనుమతి పేపర్ల పై సంతకం చేస్తున్నట్టు ఫోటోని షేర్ చేస్తూ.."కరుప్పు ఉదయం 9 గంటల షోలకు ప్రత్యేక అనుమతి మంజూరు చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు ఉదయం 9 గంటల నుండి ప్రారంభం అవుతుంది "అంటూ పోస్టులో తెలిపింది.

ఇక ఇది చూసిన అభిమానులు నెటిజన్లు అప్పుడే త్రిష హవా మొదలయింది . అందుకే ప్రత్యేక షోలకు అనుమతి తీసుకొచ్చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కరుప్పు సినిమా ప్రత్యేక షోలకు అనుమతి లభించడంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరుప్పు సినిమా విషయానికొస్తే.. ఆర్జే బాలాజీ రచనా, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సూర్య , త్రిష జంటగా నటించగా.. ఇంద్రన్స్, నట్టి, శ్వాసిక, సుప్రీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.