'మట్కా' డైరెక్టర్ ఏం చేస్తున్నట్లు?
`పలాసా` దర్శకుడు కరుణ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి దర్శ కుడిగా పేరు తెచ్చుకున్నాడు.
By: Tupaki Desk | 17 Jun 2025 8:00 PM IST`పలాసా` దర్శకుడు కరుణ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అటుపై మోట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలతో పర్వాలే దనిపించాడు. అతడిలో ట్యాలెంట్ ను గుర్తించిన మెగా క్యాంప్ ఇంకాస్త సాన బెడితే మంచి దర్శకుడవు తాడని భావించి వెబ్ సిరీస్ లు చేయించారు. దీంతో నమ్మకం కలిగింది. అనంతరం వరుణ్ తేజ్ హీరోగా 'మట్కా' చిత్రాన్ని పట్టాలెక్కించారు.
వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమా ఊహించని ఫలితాన్ని సాధించింది. అప్పటి నుంచి కరుణ్ కుమార్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఇండస్ట్రీలో అతడి పేరే వినిపించలేదు. అతడిప్పుడు ఏం చేస్తున్నాడు? అన్న చర్చ ఫిలిం సర్కిల్స్ లో దారి తీసింది. ఒక్క వైఫల్యం అతడిని దర్శకుల రేసు నుంచి వెనక్కి నెట్టింది.
'మట్కా' గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయింది. ఈ నవంబర్ కి ఏడాది పూర్తవుతుంది. అప్పటి నుంచి కొత్త సినిమా అప్ డేట్ లేదు. వరుణ్ తేజ్ మాత్రం హీరోగా సినిమాలు చేసుకుంటున్నాడు. మట్కా హిట్ అయితే గనుక కరుణ కుమార్ కెరీర్ మొత్తం కొత్త టర్నింగ్ తీసుకునేది. ఏకంగా స్టార్ హీరోలే పిలిచి అవకాశం ఇచ్చేవారు. మెగా క్యాంప్ లో అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు.
అలాంటింది అతడిని సానబెట్టి మరీ వరుణ్ తేజ్ ని తన చేతుల్లో పెట్టారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్ట లేకపోయాడు. మరి కరుణ్ కుమార్ కొత్త సినిమా అప్ డేట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి. తానే స్వయంగా రైటర్ కావడంతో ఇండస్ట్రీకి రాకముందే చాలా కథలు సిద్దం చేసి పెట్టుకున్నట్లు వెల్లడించాడు. రెగ్యు లర్ చిత్రాలకు భిన్నంగానూ ఆ కథలుంటాయన్నాడు. మరి తాజా పరిస్థితుల్లో వాటిని తానే డీల్ చేస్తాడా? స్టార్ డైరెక్టర్ల చేతుల్లో పెడతాడా? అన్నది చూడాలి.
