Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరో ఖరీదైన 'సిక్స్‌' కొట్టాడు...!

హీరోలు తమ రేంజ్ ను, తమ స్టార్ డమ్‌ ను నిరూపించుకునేందుకు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   15 March 2024 7:49 AM GMT
యంగ్‌ హీరో ఖరీదైన సిక్స్‌ కొట్టాడు...!
X

హీరోలు తమ రేంజ్ ను, తమ స్టార్ డమ్‌ ను నిరూపించుకునేందుకు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీకి చెందిన హీరోల గ్యారేజీలను పరిశీలించినా కూడా ఒక్కొక్కరి వద్ద అయిదు ఆరు అంతకు మించి కార్లు ఉండటం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మరో హీరో ఖరీదైన కార్ల విషయంలో సిక్స్‌ కొట్టాడు.

బాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్‌ హీరో కార్తిక్ ఆర్యన్ కొత్త కారును కొనుగోలు చేశాడు. తన చేతులతో స్వయంగా పూజ చేయించాడు. ఇప్పటి వరకు ఉన్న కార్లకు తోడు తాజాగా రేంజ్ రోవర్‌ 4.4p lwp sv మోడల్ ను దాదాపు రూ.5 కోట్ల తో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కార్తీక్‌ ఆర్యన్ వద్ద బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, మెక్ లారెన్ జీటీ, మినీ కూపర్ ఎస్‌, లాంబోర్గిని కార్లు ఉన్నాయి. ఈ కార్లతో పాటు స్టార్స్ స్టేటస్ గా భావించే రేంజ్‌ రోవర్‌ ను ఈ యంగ్‌ హీరో గత నెలలో బుక్ చేయడం తాజాగా డెలివరీ తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇక కార్తిక్‌ ఆర్యన్‌ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో భూల్‌ భులయ్యా 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భూల్ భులయ్యా 3 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పై కూడా ఆయన చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. కామెడీ హర్రర్ కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.