బాలీవుడ్ యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ లైనప్
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. రాబోయే సంవత్సరంన్నరలో కార్తీక్ ఆర్యన్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి.
By: Tupaki Desk | 6 May 2025 8:30 AM ISTబాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. రాబోయే సంవత్సరంన్నరలో కార్తీక్ ఆర్యన్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి. అందులో మొదటిది ఈ దీపావళికి రానుంది. రొమాంటిక్ సినిమాగా రానున్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ శ్రీలీలతో కలిసి నటిస్తున్నాడు.
ఈ సినిమాకు ఆషికి3 అని టైటిల్ ను పెట్టేట్టున్నారు. అయితే మొదటి భాగం డైరెక్టర్ మహేష్ భట్ కు మరియు మూడో పార్ట్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ మధ్య కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక రెండో ప్రాజెక్ట్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన నాగ్‌జిల్లా. ఈ సినిమా 2026లో నాగ పంచమి రోజున రిలీజ్ కానుంది. మూడవ ప్రాజెక్టుగా తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ అనే రొమాంటిక్ సినిమా. ఈ మూవీ నెక్ట్స్ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ కానుంది.
కార్తీక్ ఆర్యన్ లైనప్ చూస్తుంటే ఎంతో ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది. తన లైనప్ మొత్తం రొమాంటిక్ ఎంటర్టైనర్లు, కామెడీ ఎంటర్టైనర్లతోనే నిండిపోయింది. చూడ్డానికి ఈ సినిమాలు ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. దీపావళికి వచ్చే సినిమా నిజంగా ఆషికి3 అయితే ఆ సినిమా ఆడియన్స్ ను పెద్ద ఎత్తున ఎట్రాక్ట్ చేయడం ఖాయం. దాంతో పాటూ ఆడియన్స్ ఈ మూవీ నుంచి మంచి మ్యూజిక్ ను కూడా ఆశిస్తున్నారు.
ఇక నాగ్‌జిల్లా సినిమా విషయానికొస్తే ఆ సినిమా పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనింగ్ సినిమాలా అనిపిస్తోంది. ఒకప్పుడు కార్తీక్ ఆర్యన్ రొమాంటిక్ కామెడీ సినిమాలతో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మళ్లీ తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ సినిమాతో కార్తీక్ ఆ రేంజ్ హిట్ ను అందుకుంటాడని అంటున్నారు.
అయితే ఈ లిస్ట్ లో కార్తీక్ కు రిస్క్ కూడా ఉంది. అందులో కనీసం ఒక్క సినిమా అయినా ఆకట్టుకోలేకపోతే తర్వాతి సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడే ఛాన్సుంది. మరి ఈ ప్రాజెక్టులతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి కార్తీక్ ఆర్యన్ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
