శ్రీలీల లవ్.. ట్విస్ట్ ఇచ్చిన యువ హీరో!
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 April 2025 2:52 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో శ్రీలీల తన బీటౌన్ డెబ్యూ మూవీ చేస్తుండగా.. అందులో కార్తీక్ హీరోగా నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ టైమ్ లోనే ఇద్దరూ లవ్ లో పడ్డట్టు టాక్ వచ్చింది.
ఆ తర్వాత మూవీ షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఇద్దరూ చాలా క్లోజ్ గా కనిపించారు. అంతకుముందు కార్తీక్ తల్లి ఓ కార్యక్రమంలో తనకు కాబోయే కోడలు గురించి మాట్లాడారు. ఓ మంచి డాక్టర్ ను తమ ఇంటి కోడలిగా చేసుకోవాలనుందని అన్నారు.
రీసెంట్ గా శ్రీలీల.. ఇన్ స్టాగ్రామ్ చిట్ చాట్ లో ప్రేమపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీంతో శ్రీలీల, కార్తీక్ లవ్ లో ఉన్నారని అంతా ఫిక్సయిపోయారు. అయితే తాజాగా కార్తిక్ ఆర్యన్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో విషయంపై మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని తెలిపారు.
అయితే కార్తీక్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆయన.. ఇండస్ట్రీలో అంత పారితోషికం తీసుకునే నటుడు తాను ఒక్కడినేనా అని క్వశ్చన్ చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారని అన్నారు. కానీ వారి గురించి ఎవరూ వార్తలు రాయరని అన్నారు.
తనకు ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేదని, అందుకే అలాంటి వార్తలు రాస్తారని వ్యాఖ్యానించారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన తనకు ఇండస్ట్రీలో అన్నదమ్ములు, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ లేరని తెలిపారు. రూమర్స్ క్రియేట్ చేయడానికి కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారని, తమకు నచ్చని వారి కోసం అలా చేస్తారని చెప్పారు.
అయితే తన కామెంట్స్ లో శ్రీలీల పేరు ఎక్కడా కార్తిక్ ఆర్యన్ ప్రస్తావించకపోయినా.. సినీ ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పడం గమనార్హం. కానీ నెటిజన్లు మాత్రం ఇద్దరూ లవ్ లో ఉండడం నిజమేనని అంటున్నారు. మొత్తానికి శ్రీలీల, కార్తీక్ లవ్ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ విషయంలో అసలు నిజమేంటో వాళ్లకే తెలియాలి.
