శ్రీలీల మంకీ ఫేస్.. ఆట పట్టించిన హీరో
టాలీవుడ్ టు బాలీవుడ్ శ్రీలీల ఎంత ఫేమస్సో తెలిసిందే. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఖాతాలో వేసుకుంటున్న ఈ బ్యూటీ ప్రతిభకు తగ్గ అవకాశాల్ని అందుకుంటోంది.
By: Tupaki Desk | 16 Jun 2025 12:20 AM ISTటాలీవుడ్ టు బాలీవుడ్ శ్రీలీల ఎంత ఫేమస్సో తెలిసిందే. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఖాతాలో వేసుకుంటున్న ఈ బ్యూటీ ప్రతిభకు తగ్గ అవకాశాల్ని అందుకుంటోంది. ఇక కార్తీక్ ఆర్యన్ లాంటి యంగ్ హీరోతో ఎనర్జిటిక్ శ్రీలీల జోడీ కడితే ఎలా ఉంటుందో ఇప్పటికే అభిమానులకు అర్థమైంది. ఆషిఖి తరహా రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ లో ఆ ఇద్దరి మధ్యా ర్యాపో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఇద్దరూ కలిసి షికార్లు చేస్తున్నారని, డేటింగ్ లో ఉన్నారని రకరకాలుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉండగానే శ్రీలీలకు కార్తీక్ ఆర్యన్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈరోజుతో శ్రీలీల వయసు 24. తన పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ శ్రీలీలతో కలిసి ఉన్న ఒక అందమైన సెల్ఫీని షేర్ చేస్తూ ఆ పోస్ట్‌కు ``హ్యాపీ బర్త్‌డే మంకీ ఫేస్.. శ్రీలీల`` అనే క్యాప్షన్ ఇచ్చారు. కార్తీక్ చాలా జోవియల్ గా ఈ వ్యాఖ్యను జోడించగానే అభిమానులు అతడిలోని ఫన్ కి సరదాగా ప్రతిస్పందిస్తున్నారు.
ఈ సెల్ఫీలో శ్రీలీల ఎక్స్ ప్రెషన్ కూడా ఆకట్టుకుంది. సెట్స్ లో ఆ ఇద్దరూ సరదాగా కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నారని అర్థమవుతోంది. ఆ ఇద్దరూ తమ రిలేషన్ షిప్ ని బహిరంగంగా ధృవీకరించనప్పటికీ, ఇద్దరి మధ్యా పెరుగుతున్న సాన్నిహిత్యం, ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులలో గాసిప్ కాలమ్‌లలో ఆసక్తిని కలిగించే అంశంగా మారాయి. ప్రస్తుతం దర్శకుడు అనురాగ్ బసుతో కలిసి ప్రేమకథా చిత్రంలో నటిస్తుండడంతో అది చాలా గమ్మత్తుగా మారింది. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. షూటింగ్ మొదలైనప్పటి నుండి కార్తీక్ - శ్రీలీల జంటకు సంబంధించిన ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. కార్తీక్ తో పార్టీల్లోను శ్రీలీల ఎక్కువగా కనిపించడంతో డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి.
ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కార్తీక్ ప్రస్తుతం క్రొయేషియాలో తన తదుపరి రొమాంటిక్ చిత్రం `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ` షూటింగ్‌లో ఉన్నాడు. ఈ చిత్రంలో అతడు మాజీ గాళ్ ఫ్రెండ్ అనన్య పాండేతో కలిసి పని చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే వాలెంటైన్స్ డే కానుకగా 13 ఫిబ్రవరి 2026న విడుదలవుతుంది.
