Begin typing your search above and press return to search.

పాముల మ‌ధ్య‌లో హీరో...ఇది న్యాయ‌మేనా సార్!

యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా క‌ర‌ణ్ జోహార్ తో ఓ సినిమాకి అగ్రిమెంట్ జ‌రిగింది. 'ఫుక్రే' ఫేం మృగ్ దీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది.

By:  Tupaki Desk   |   11 April 2025 10:30 AM
పాముల మ‌ధ్య‌లో హీరో...ఇది న్యాయ‌మేనా సార్!
X

ఇటీవ‌లే టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి.ఎన్ ఆదిత్య 'ఫ‌ణి' అనే సినిమా కోసం 20 పాముల్ని చూసి వాటిలో ఐదింటిని ఎంపిక చేసి వాటికి ఆడిష‌న్ చేసి ఓ పామును ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. పాముల్ని ఇలా ఆడిష‌న్ చేసి ఎంపిక చేయ‌డం అన్న‌ది భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. పాములు చాలా సినిమాల్లో క‌నిపిస్తుంటాయి. కానీ వాటికి ఆడిష‌న్ మాత్రం ఎవ‌రూ అంత‌వ‌ర‌కూ చేయ‌లేదు.

తొలిసారి 'ఫణి' కోసం చేసి ఆదిత్య నెట్టింట బాగా ఫేమ‌స్ అయ్యారు. సినిమాలో ఆ పాము చాలా కీల‌క పాత్ర కావ‌డంతోనే చాలా స‌మ‌యం వెచ్చించి మ‌రీ ఎంపిక చేసారు. తాజాగా బాలీవుడ్ లో కూడ ఇలాంటి ఓ ప్ర‌యోగం రెడీ అవుతుంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా క‌ర‌ణ్ జోహార్ తో ఓ సినిమాకి అగ్రిమెంట్ జ‌రిగింది. 'ఫుక్రే' ఫేం మృగ్ దీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది. కామెడీ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్ర‌మిది.

దీనికి 'నాగ‌రాజ్' అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ వెనుక చాలా పెద్ద క‌థే ఉంది. ఈ సినిమాలో ఓ పాము కూడా న‌టిస్తుంది. క‌థ అంతా ఆ పాము చుట్టూనే తిరుగుతుందట‌. అదే క‌థ‌ని కామెడీగా చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో పాముల‌తో పోరాడే సాహ‌స‌కుడి పాత్ర‌లో కార్తీక్ ఆర్య‌న్ న‌టిస్తున్నాడట‌. సెప్టెంబ‌ర్లో ఈ సినిమా మొద‌లు పెట్ట‌డానికి రెడీ అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలో యూనిట్ ఓ 50 పాముల కోసం వెతుకుతుందట‌. హీరో పాత్ర పాముల‌తో కావ‌డ‌టంతో షూటింగ్ కి అన్ని పాములు అవ‌స‌రం ప‌డుతున్నాట‌య‌. దీనిలో భాగంగా ఆ పాముల్ని అట‌వీ చ‌ట్టానికి లోబ‌డి తీసుకొచ్చి వాటికి కొంత ట్రైనింగ్ ఇవ్వాల‌ని చూస్తున్నారట‌. ఈ నేప‌థ్యంలో పాములు ప‌ట్ట‌డంలో, విషానికి విరుగుడు ఇవ్వ‌డంలో అనుభ‌వ‌జ్ఞుల్ని కూడా రంగంలోకి దించుతున్నారట‌.

పాముల‌తో స‌న్నివేశాలు చిత్రీక‌రించే స‌మ‌యంలో ప్ర‌త్యేక టీమ్ స్పాట్ లో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారట‌. ఇలాంటి స‌న్నివేశాల్ని గ్రాఫిక్స్ చేయోచ్చు. లేదా? ఏఐ స‌హాయంతో క్రియేట్ చేయోచ్చు. కానీ స‌హ‌జ‌త్వం ఉండ‌ద‌నే ఆలోచ‌న‌తో క‌ర‌ణ్ వాస్త‌వ పాముల‌తోనే షూటింగ్ చేద్దామ‌న్నారట‌.