Begin typing your search above and press return to search.

పీఆర్‌తో సూపర్ స్టార్‌ కాలేవు చిన్నా..!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు పీఆర్ అనేది చాలా ముఖ్యం అయింది. వారు చేసిన ప్రాజెక్ట్‌లను ప్రచారం చేసుకుంటే తప్ప మరిన్ని పెద్ద ఆఫర్లు వచ్చే పరిస్థితి ఉండదు.

By:  Tupaki Desk   |   20 May 2025 6:30 AM
పీఆర్‌తో సూపర్ స్టార్‌ కాలేవు చిన్నా..!
X

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు పీఆర్ అనేది చాలా ముఖ్యం అయింది. వారు చేసిన ప్రాజెక్ట్‌లను ప్రచారం చేసుకుంటే తప్ప మరిన్ని పెద్ద ఆఫర్లు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పీఆర్ చేయించే వారు చాలా మంది ఉన్నారు. పీఆర్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ హీరోలు ముందు వరుసలో ఉంటారు అని మీమ్స్ కూడా ఉన్నాయి. సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం కోసం హిందీ హీరోలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ పీఆర్‌ కంపెనీలతో వారు తమ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

బాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో సక్సెస్‌ రేటు దారుణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో సినిమాల మేకింగ్‌ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు పడుతున్నారు. గతంలో అనుకున్న కొన్ని సినిమాలను రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. యంగ్‌ హీరోలు వరుస సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నిర్మాతలు, దర్శకులు మాత్రం ముందుకు రావడం లేదు. అందుకే హీరోలు పీఆర్‌ చేయించుకోవడం ద్వారా సినిమా ఆఫర్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ జోరు బాగా కనిపిస్తుంది. ఆయన పీఆర్‌ అంతకు మించి ఉంది.

బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకున్న కార్తీక్‌ ఆర్యన్‌ కరోనా సమయం నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కరోనా కారణంగా చాలా మంది హీరోలు కనీసం గుర్తింపు కోల్పోతే కార్తీక్‌ ఆర్యన్‌ మాత్రం వందల కోట్ల వసూళ్లతో దూసుకు పోతున్నాడు. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను కార్తీక్‌ ఆర్యన్‌ నిలబెట్టే విధంగా పలు సినిమాలను తీసుకు వచ్చాడు. అందుకే ఆయనకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. తనకు దక్కిన క్రేజ్‌ను ఉపయోగించుకుని సూపర్‌ స్టార్‌ హోదాను దక్కించుకునేందుకు గాను కార్తీక్‌ ఆర్యన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చాలా ఖరీదైన పీఆర్‌ టీంను హైర్ చేసుకున్నాడని, వారు కార్తీక్‌ ఆర్యన్‌ను సూపర్‌ స్టార్‌గా ప్రచారం చేస్తూ తెడ హడావిడి చేస్తున్నారని బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది.

కార్తీక్‌ ఆర్యన్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువ సక్సెస్‌లు దక్కించుకున్న హీరో అనడంలో సందేహం లేదు. అయితే ఆయన సూపర్‌ స్టార్‌ హోదా దక్కించుకోవడం కోసం, ప్రస్తుత యంగ్ హీరోల్లో టాప్‌ స్టార్‌గా నిలవాలంటే ఇంకొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే. మరికొన్ని హిట్స్ పడాల్సిందే. అలా పడితేనే బాలీవుడ్‌ లో టాప్ స్టార్‌గా, సూపర్‌ స్టార్‌గా కార్తీక్‌ ఆర్యన్‌కి గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా పీఆర్‌ తో సూపర్‌ స్టార్‌ ఇమేజ్ పొందాలంటే కష్టం చిన్నా అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కార్తీక్‌ ఆర్యన్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా తనకు గత ఏడాదిలో చేసిన సినిమాలకు గాను ఒకే సారి రెండు ఉత్తమ నటుడు అవార్డ్‌లు వచ్చాయంటూ షేర్ చేసిన ఫోటో తెగ ట్రోల్‌ అవుతోంది. ఇటీవల జరిగిన ఉగ్రదాడి గురించి స్పందించలేదు కానీ ఇలా రెండు అవార్డ్‌లు వచ్చాయని పీఆర్‌ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ నెటిజన్స్ కార్తీక్‌ ఆర్యన్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హిట్‌ సినిమాలు చేయడం మాత్రమే కాకుండా హుందాగా వ్యవహరించినప్పుడు మాత్రమే జనాలు మరింతగా ఆధరించి, సూపర్‌ స్టార్‌ హోదా ఇస్తారు అనే విషయాన్ని కార్తీక్ ఆర్యన్‌ గుర్తించాల్సిన అవసరం ఉంది.