నన్ను బెదిరించారు.. హీరోపై కుట్ర పాడ్ కాస్ట్ ఫలితం
కార్తీక్ ఆర్యన్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లా చేసినా ఆశ్చ్యర్యపోనవసరం లేదని అన్నాడు.
By: Tupaki Desk | 6 July 2025 11:15 PM ISTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ తరహాలోనే పరిశ్రమలో ప్రతిభావంతుడైన కార్తీక్ ఆర్యన్ కూడా కుట్రల్ని, గ్రూపు రాజకీయాల్ని ఎదుర్కొంటున్నాడని ఆరోపించాడు గాయకుడు, సంగీత దర్శకుడు అమల్ మాలిక్. ప్రఖ్యాత గాయకుడు ఆర్మాన్ మాలిక్ సోదరుడు అమల్ మాలిక్. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న అతడు మిర్చి ప్లస్ పాడ్ కాస్ట్ లో హోస్ట్ గౌరవ్ ఠాకూర్ తో మాట్లాడుతూ.. నటుడు కార్తీక్ ఆర్యన్ పై జరుగుతున్న కుట్ర సిద్ధాంతం గుట్టు విప్పాడు.
కార్తీక్ ఆర్యన్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లా చేసినా ఆశ్చ్యర్యపోనవసరం లేదని అన్నాడు. అతడు తన తల్లిదండ్రుల మద్ధతు, ప్రోత్సాహంతో అన్నిటినీ ఎదుర్కొన్నాడని ఇంటర్వ్యూలో అన్నాడు. కార్తీక్ ఆర్యన్ ని కొందరు పెద్ద స్థాయి వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి టార్గెట్ చేసారని కూడా బాలీవుడ్ చీకటి కోణాన్ని బహిరంగంగా రివీల్ చేసాడు.
అయితే ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేసిన వీడియోను తొలగించాల్సిందిగా హోస్ట్ గౌరవ్ ఠాకూర్ బెదిరింపు కాల్స్ ని ఎదుర్కొన్నానని తాజాగా వెల్లడించాడు. తాను మీడియా సూత్రాలకు కట్టుబడి ఉన్నానని, ఆ వీడియోని తొలగించనని బెదిరించిన వారికి చెప్పినట్టు తెలిపాడు. ఈ వీడియోలో కట్టుకథలు లేవు. స్క్రిప్టు రాయలేదు. అప్పటికప్పుడు మనసు నుంచి వచ్చిన మాటలు. ఇది పీఆర్ స్టంట్ కూడా కాదు అని గౌరవ్ ఠాకూర్ అన్నారు. సత్యం ఎల్లప్పుడూ మాట్లాడబడుతుందని అతడు అన్నాడు. ఇందులో సంభాషణలు అన్నీ నిజాయితీతో కూడుకున్నవని కూడా హోస్ట్ గౌరవ్ అన్నాడు. నిజం ఎల్లప్పుడూ మాట్లాడుతుంది.. అది ఎంత అసౌకర్యంగా ఉన్నా! అని అన్నాడు. అమల్ - కార్తీక్ అభిమానుల గొప్ప మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ రాజకీయాల కారణంగా డిప్రెషన్ కి గురైన సంగతి తెలిసిందే. అతడికి సక్సెస్ ఉన్నా అవకాశాలు రాకుండా చేసారని ఆరోపణలు వచ్చాయి. కొందరు పెద్ద స్థాయి వ్యక్తులు అతడిపై కుట్ర చేసారని మీడియాలో కథనాలొచ్చాయి. అతడి బలవన్మరణం వెనక చాలా థియరీలు ఇప్పటికీ అభిమానుల్లో ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు అదే గతి కార్తీక్ ఆర్యన్ కి పడుతుందని వ్యాఖ్యానించడంతో గాయకుడు అమల్ మాలిక్ అందరి దృష్టిని ఆకర్షించాడు.