ఆ యంగ్ హీరోపై అంత పెద్ద రాజకీయమా?
బాలీవుడ్ లో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళ్లి సక్సెస్ అయ్యాడు.
By: Tupaki Desk | 5 July 2025 6:00 PM ISTబాలీవుడ్ లో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళ్లి సక్సెస్ అయ్యాడు. సుశాత్ సింగ్ రాజ్ పుత్ తరహాలోనే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. పదేళ్ల క్రితమే కెరీర్ మొదలైన కార్తీక్ కు ఈ మధ్య కాలంలో ఎక్కువ గుర్తింపు దక్కింది. వరుసగా అతడు నటిస్తోన్న సినిమాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లోనే భారీ వసూళ్లను రాబడు తున్నాయి. 'భూల్ భులయ్య' రెండు చిత్రాల్లోనూ నటించాడు.
రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. బయోపిక్ చందు ఛాంపియన్ కూడా మంచి ఫలితాలు సాధించింది.ఈ సినిమాలో కార్తీక్ కి బాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ని తీసుకొచ్చాయి. ఈ సమయంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన బ్యానర్లో ఓ సినిమాకు హీరోగాను ఎంపిక చేసాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అందులో కార్తీక్ కూడా పాల్గొన్నాడు. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ మధ్యలో నుంచి కార్తీక్ ని తొలగించారు.
అప్పుడే కార్తీక్ పై బాలీవుడ్ రాజకీయం చేస్తోందా? అన్న అనుమానం వ్యక్తమైంది. తాజాగా కార్తీక్ కెరీర్ జర్నీని ఉద్దేశించి గాయకుడు అమాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 'ఇక్కడ చికట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దాన్ని ఎదురించలేకపోయాడు. హత్య అని కొందరు? ఆత్మహత్య అని మరికొంత మంది అంటారు. మరి ఇందులో ఏది నిజమో! సినిమా అనేది మనసును , మెదడును దెబ్బ తీస్తుంది. ఆత్మస్తైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది.
కార్తీక్ కూడా ప్రత్యక్షంగానో..పరోక్షంగానో అతడి ఎదుగదలపై రాజకీయం జరిగింది. కానీ తనకెదురైన అనుభవాలను చిరునవ్వుతో స్వాగతించాడు. వాటిని తెలివిగా తిప్పి కొట్టాడు. వెనుక నుంచి అతడికి పేరెంట్స్ సహకారం ఉంది. పరిశ్రమలో కొత్త వాడైన సొంతంగా ఎదిగాడు. కార్తీక్ ను బయటకు పంపిచాలని చాలా మంది ప్రయత్నించారు. ఇందులో పెద్ద హీరోలు, నిర్మాతలు చాలా మంది ఉన్నారు. కానీ కార్తీక్ వాళ్లను ఎదుర్కుని నిలబడడ్డాడు' అని అన్నాడు.