Begin typing your search above and press return to search.

ఐదేళ్ల క్రింత సినిమాకు ఇప్ప‌టికి మోక్షం!

బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ క‌థానాయ‌కుడిగా హ‌న్సల్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ 'కెప్టెన్ ఇండియా' చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   28 March 2026 11:49 AM IST
ఐదేళ్ల క్రింత సినిమాకు ఇప్ప‌టికి మోక్షం!
X

బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ క‌థానాయ‌కుడిగా హ‌న్సల్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ 'కెప్టెన్ ఇండియా' చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయులను రక్షించే ఒక పైలట్ కథాంశంతో ఈ సినిమాను దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకటించారు. కానీ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అప్ప‌టి నుంచి సినిమాకు సంబంధించి ఎలాంటి స‌మాచారం కూడా బ‌య‌ట‌కు రాలేదు. దీంతో సినిమా ర‌ద్దు అయింద‌ని భావిస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ ర‌ద్ద‌వ్వ‌లేదు. తాజాగా చిత్రాన్ని మే లేదా జులైలో నెల‌లో ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

తొలుత ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి ఆయ‌న త‌ప్పుకున్నారు. హ‌న్స‌ల్ మెహ‌తా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం , నిర్మాణ సంస్థల మధ్య వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బాధ్యతలను బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు `చెక్ దే ఇండియా` ఫేమ్ షమిత్ అమీన్ స్వీకరించడం విశేషం. చాలా కాలం తర్వాత షమిత్ అమీన్ మెగా ఫోన్ ప‌ట్ట‌డం విశేషం. ష‌మీత్ కూడా ఐదేళ్ల‌గా కెప్టెన్ కుర్చీకి దూరంగా ఉన్నారు.

కానీ ఇలాంటి క‌థ‌కు అత‌డైతే క‌రెక్ట్ అని భావించి నిర్మాత‌లు ష‌మీత్ ను రంగంలోకి దించుతున్నారు. షమిత్ మార్క్ ఎమోషన్స్ , దేశభక్తి అంశాలు ఈ కథకు సరిగ్గా సరిపోతాయని విశ్లేష‌కులు సైతం భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జ‌రిగితే స‌మ్మ‌ర్ అనంత‌రం పట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. అత‌డి ఇమేజ్ ఈ ప్రాజెక్ట్ కు క‌లిసొస్తుంది. ఐదేళ్ల క్రిత‌మే `కెప్టెన్ ఇండియా` కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. పైలైట్ గా అత‌డి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ అప్ప‌ట్లో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

కానీ అప్ప‌టికే క‌మిట్ అయిన సినిమాలు క్యూలో ఉండ‌టంతో? ఆ లుక్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు. ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ హీరోగా `నాగ్జిల్లా` తెర‌కెక్కుతోంది. అలాగే అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన అనంత‌రం కెప్టెన్ ఇండియాకు డేట్లు కేటాయించ‌నున్నాడు. ఈలోగా `కెప్టెన్ ఇండియా`కు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తి కానున్నాయి. మొత్తానికి ఆగిపోయిన‌ `కెప్టెన్ ఇండియా` మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిచండంతో కార్తీక్ ఆర్య‌న్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కార్తీక్ ఆర్య‌న్ కు ఇలాంటి సినిమాలే అసలైన గుర్తింపును ఇస్తాయ‌ని అభిమానులు ఆశీస్తున్నారు.