Begin typing your search above and press return to search.

WWE రింగులో పంచ్ లు విసిరిన కార్తీ!

రింగులో పైట‌ర్లు ఎంత‌గా పంచ్ లు విసురుకుంటారా? గ్యాల‌రీలో కూర్చున్న వారి ఆస్వాదించే వారి ర‌క్తం సైతం అంత‌కంత‌కు మ‌రిగిపోతుంది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 8:09 AM GMT
WWE రింగులో పంచ్ లు విసిరిన కార్తీ!
X

డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఈ స్పోర్స్ట్ ఛాన‌ల్ అభిమాని కానిది ఎవ‌రు? షోలో పిడుగుద్దులు...కుర్చీలు ప‌ట్టుకుని ఒక‌ర్నీ ఒక‌రు బాదుకోవ‌డం...బ‌ల‌మైన పంచ్ లు చూస్తే ఇదంతా! నిజ‌మా! అబ‌ద్ద‌మా? అని ఆశ్చ‌ర్య‌పోతాం. చూడ‌టానికి రియ‌ల్ గా అనిపిస్తుంది. కానీ ఇదంతా నిజ‌మేనా? లేక అంతా డూప్ అని అనిపిస్తుంది. ఇక ఈ షో కి వ‌ర‌ల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

రింగులో పైట‌ర్లు ఎంత‌గా పంచ్ లు విసురుకుంటారా? గ్యాల‌రీలో కూర్చున్న వారి ఆస్వాదించే వారి ర‌క్తం సైతం అంత‌కంత‌కు మ‌రిగిపోతుంది. అంత‌టి క్రేజీ షో ఇది. ఈ షోకి వ‌ర‌ల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రింగులో ఈ త‌ర‌హా యాక్ష‌న్ ని ఎంతో మంది ప్రేక్ష‌కాభిమానులు ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఈ ఛానెల్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌కాబోతుంది. సౌత్ స్టార్ రెండు చిత్రాల‌ను సోనీ స్పోర్స్ట్ ప్రారంభించింది. కార్తీ గొంత‌ను అందించ‌డ‌మే కాకుండా ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌చార క‌ర్త‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

`హీరోలు వ‌ర్సెస్ విల‌న్లు` టైటిల్ తో పాటు.. `బ‌లం వ‌ర్సెస్ విన్యాసాలు` అనే రెండు కాన్సెప్ట్ ల‌తో ఇవి వ‌స్తున్నాయి. ఈ సంద‌ర్భంగా కార్తీ మాట్లాడుతూ.. `డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఈ మ‌ర్చిపోలేని స్టంట్స్ ఇచ్చారు. వాళ్ల అసాధ్య‌మైన స్టంట్స్ ద్వారా మ‌నికి అద్భుతాలు చూపించారు. ఈ డేర్ డెవిల్స్ స్టంట్స్ కి పెట్టింది పేరు. ఇదిగో రింగ్ బ్రేకింగ్ యాక్ష‌న్. హీరోలు..విల‌న్ల పాత్ర‌ల‌ను సృష్టించ‌డం నాకు మ‌రుపురాని అనుభ‌వం.

వారిని యాక్ష‌న్ లో చూడ‌టం ఆనందంగా ఉంది. డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఈ` కి భార‌త్ లోనూ..ముఖ్యంగా సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక అభిమానిగా సోనీ స్పోర్స్ట్ నెట్ వ‌ర్క్...డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఈ క‌లిసి ప‌నిచేయ‌డం గొప్ప అనుభూతినిచ్చింది` అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ షోకి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కార్తీ రంగంలోకి దిగ‌డంతో సౌత్ లో మ‌రింత క్రేజీ షోగా మారు తుందని అంతా భావిస్తున్నారు.