Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ న‌టుడి అభిమానిగా స్టార్ హీరో

ఇది ఓ భిన్న‌మైన వినోదాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. అయితే ఇదే సినిమాలో కార్తీ లెజెండ‌రీ న‌టుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ వీరాభిమాని పాత్ర‌లో మెప్పించ‌బోతున్నాడు.

By:  Tupaki Desk   |   10 March 2024 2:30 PM GMT
లెజెండ‌రీ న‌టుడి అభిమానిగా స్టార్ హీరో
X

కొన్ని నెల‌లుగా కార్తీ సీక్వెల్స్ స్టోరీల్నే సెట్స్ పైకి తీసుకెళ్తార‌ని భారీ ఎత్తున ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. హిట్ సినిమాల‌కు కొన‌సాగింపు గా 2024 లో వాటితోనే సంద‌డి చేయ‌నున్నార‌ని కోలీవుడ్ లో ఓ రేంజ్ లో ప్ర‌చారం సాగింది. 'ఖాకీ-2'..'స‌ర్దార్ -2' అంటూ కొన్ని సినిమా పేర్లు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. కానీ అన్నింటిని త‌ల్ల‌కిందులు చేస్తూ కార్తీ ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. స‌ల‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ‌లో లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు ముగించుకుంది.

ఇది ఓ భిన్న‌మైన వినోదాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. అయితే ఇదే సినిమాలో కార్తీ లెజెండ‌రీ న‌టుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ వీరాభిమాని పాత్ర‌లో మెప్పించ‌బోతున్నాడు. ఈ సినిమా క‌థ‌కి..ఎంజీఆర్ రోల్ కి లింక్ ఏంటి? అన్న‌ది ఇంకా బయ‌ట‌కు రాలేదు గానీ పాత్ర అదేన‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. ఇంత‌వ‌ర‌కూ కార్తీ ఇలాంటి రోల్ పోషించింది లేదు. హీరోల‌కు అభిమానిగా న‌టించ‌డం అన్న‌ది కార్తీ కెరీర్ లో ఇదే తొలి సారి.

ఇందులో కార్తీకి జోడీగా కృతి శెట్టి న‌టిస్తుంది. ఈ చిత్రానికి 'వావాతియారే' అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇటీవలే కార్తీ ఓ సినిమా షూటింగ్ పూర్తిచేసాడు. ఈ నేప‌థ్యంలో గ్యాప్ తీసుకోకుండా కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. కార్తీ చివ‌రిగా జ‌పాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.

పొన్నియ‌న్ సెల్వ‌న్ తో భారీ స‌క్సెస్ అందుకున్న అది సోలో క్రెడిట్ కి ఛాన్స్ లేని సినిమా. అంత‌కు ముందు రిలీజ్ అయిన 'స‌ర్దార్' కేవ‌లం త‌మిళ‌ల అభిమానుల్నే మెప్పించింది. తెలుగులో స్పై అభిమానుల్ని బాగానే అల‌రించింది. దీనికి సీక్వెల్ కూడా ప్ర‌క‌టించిన‌సంగ‌తి తెలిసిందే.