Begin typing your search above and press return to search.

స్టార్ హీరో రేర్ రికార్డు క్రియేట్ చేస్తున్నాడుగా!

ఆయ‌న లైన‌ప్ చూస్తేంటే ఈ విష‌యాన్ని క‌న్ప‌మ్ చేసుకోవాల్సి ఉంటుందేమో అనిపిస్తోంది

By:  Tupaki Desk   |   8 Dec 2023 12:30 AM GMT
స్టార్ హీరో రేర్ రికార్డు క్రియేట్ చేస్తున్నాడుగా!
X

'ఖైదీ' త‌ర్వాత కోలీవుడ్ హీరో కార్తీకి స‌రైన సోలో హిట్ ప‌డ‌లేదు. అటుపై న‌టించిన సినిమాలేవి ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. 'పొన్నియ‌న్ సెల్వ‌న్' విజ‌యం సాధించినా ఆ క్రెడిట్ అందులో న‌టించిన హీరోలం ద‌రిది. 'తంబీ'.. 'సుల్తాన్' 'లాంటి చిత్రాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'జ‌పాన్' కూడా నిరాశ‌నే మిగిల్చింది. దీంతో కార్తి హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ నే న‌మ్ముకున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఆయ‌న లైన‌ప్ చూస్తేంటే ఈ విష‌యాన్ని క‌న్ప‌మ్ చేసుకోవాల్సి ఉంటుందేమో అనిపిస్తోంది. ఇటీవ‌లే 'ఖాకీ' సినిమా సీక్వెల్ అధికారికంగా ప్ర‌క‌టించారు. సీక్వెల్ ఉంటుంద‌ని ఇంత‌కాలం ప్ర‌చారం త‌ప్ప క్లారిటీ లేదు. తాజా ప్ర‌క‌న‌ట‌తో క్లారిటీ వ‌చ్చేసింది. అలాగే లొకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖైదీ -2' ఉండ‌నే ఉంది. ఆ లింక్ ఎలా ఉంటుంద‌న్న‌ది తెలియ‌దు గానీ అందులో హీరో మాత్రం కార్తీనే.

మ‌రోవైపు 'స‌ర్దార్' సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలా మూడు హిట్ సినిమాల‌కు సీక్వెల్ ని ఒకే ఏడాది పట్టాలెక్కించేలా కార్తీ ప్లాన్ చేస్తున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతుంది. వాస్త‌వానికి ఇంత‌కు ముందే 'ఖైదీ-2'..'ఖాకీ-2'లు ఒకేసారి ప్లాన్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇప్పుడా రెండు చిత్రాల‌కు తోడుగా 'స‌ర్దార్ -2'కూడా యాడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. కార్తీ ఇలా ఒకేసారి మూడు హిట్ సినిమాల సీక్వెల్స్ ని తెర‌పైకి తేవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇవ‌న్నీ ఒకే ఏడాది ప‌ట్టాలెక్కించగ‌ల్గితే గ‌నుక ఇది రికార్డు అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ ఏ హీరో సీక్వెల్స్ ని ఇలా ప్లాన్ చేసింది లేదు. కానీ కార్తీ మాత్రం ఒకేసారి రెండు..మూడు సినిమా షూట్లు పూర్తి చేసిన ఘ‌న‌త ఉంది. ఆ న‌మ్మ‌కంతోనే సీక్వెల్స్ పై కాన్పిడెంట్ గా ముందుకెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం కార్తీ ఆ సినిమాల‌కు సంబంధించిన ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. వీట‌న్నింటిని 2024 లోనే ప్లాన్ చేస్తాడా? అన్న‌ది చూడాలి.