Begin typing your search above and press return to search.

విశాల్ కి కౌంట‌ర్ ఇచ్చిన నిర్మాత‌!

కోలీవుడ్ హీరో విశాల్ ఎట్ట‌కుల‌కు 'మార్క్ ఆంటోనీ'తో విజ‌యం ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం విజ‌యానందంలో ఉన్నాడు

By:  Tupaki Desk   |   28 Sep 2023 11:29 AM GMT
విశాల్ కి కౌంట‌ర్ ఇచ్చిన నిర్మాత‌!
X

కోలీవుడ్ హీరో విశాల్ ఎట్ట‌కుల‌కు 'మార్క్ ఆంటోనీ'తో విజ‌యం ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం విజ‌యానందంలో ఉన్నాడు. చాలా కాలం త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ ఇది. స‌క్సెస్ కోసం మూడేళ్ల‌గా సీరియ‌స్ గా సినిమాలు చేస్తున్నా అది ఎక్క‌డా క‌నిపించ‌లేదు. చాలా సినిమాలు సొంత బ్యాన‌ర్లోనే నిర్మించ‌డంతో న‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అయినా విశాల్ ఏమాత్రం వెనక్కి ద‌క్క‌లేదు.

ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న బ్యాన‌ర్లోనే సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు. తాజాగా 'మార్క్ ఆంటోనీ'తో అది సాధించాడు. ఈ పాజిటివ్ టాక్ ని జ‌నాల‌కు మ‌రింత రీచ్ అయ్యేలా ప్ర‌మోష‌న్ చేస్తున్నాడు. రిలీజ్ కి ముందులానే...రిలీజ్ త‌ర్వాత మీడియా లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో విశాల్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసాడు.

కొత్తగా ప‌రిశ్ర‌మకి నిర్మాత‌లు కావాల‌నా ఆశ‌ప‌డే వారు మాత్ర మూడు...నాలుగు కోట్టు ప‌ట్టుకుని సినిమాలు నిర్మించ‌డానికి రావొద్ద‌ని సూచించాడు. అలా వ‌స్తే ఇక్క‌డ నిల‌బ‌డ‌టం..సాధించ‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ కౌంటర్ ఇచ్చారు. విశాల్ వ్యాఖ్య‌ల్ని ఆయ‌న ఖండించారు. సినిమా బడ్జెట్ కథను బట్టి డిమాండ్ ను బట్టి ఉంటుందన్నారు.

'ఇంత బడ్జెట్ లోనే సినిమాను నిర్మించాలనే నిబంధన ఏదీ లేదు. ఒక సినిమాను కోటి రూపాయలతో తీయొచ్చని లేదా రూ. 100 కోట్లతో కూడా తీయొచ్చు. అది వారి ఇష్టాల‌ను బట్టి ఉంటుంది. కోటి సినిమాలు తీసినోడు రేపు 100 కోట్లు పెట్టొచ్చు. వ‌చ్చిన లాభాలు పెట్టుబ‌డిగా పెట్టే అవ‌కాశం ఉంటుంది. అలాంటి వాళ్ల‌కి ర‌క‌ర‌కాల సోర్సెస్ ద్వారా ప‌రిశ్ర‌మ‌లో ఎద‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

కానీ విశాల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ‌టం భావ్యం కాదు. విశాల్ మాటలు వింటుంటే కొత్త సనాతన ధర్మమేమో అనిపిస్తుంది' అని అన్నారు. ఇటీవ‌లి కాలంలో విశాల్ పేరు ఎక్కువ‌గా వివాదాస్ప‌దం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. జాతీయ అవార్డుల్ని కించ ప‌రిచేలా చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్ లో ఎంత దుమారం రేపాయో తెలిసిందే. అలాగే త‌మిళ నిర్మాల సంఘం రెడ్ కార్టు ఇచ్చి సినిమాల నుంచి రెండేళ్ల పాటు వేటు వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.