Begin typing your search above and press return to search.

ఆ ఒక్కడి వల్లే ఇదంతా..!

చిత్ర యూనిట్ సమక్షంలోనే జరిగిన ఈ ఈవెంట్ లో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్వీట్ అండ్ షార్ట్ స్పీచ్ అతనిలోని కాన్ఫిడెన్స్ ని తెలిసేలా చేసింది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:05 AM GMT
ఆ ఒక్కడి వల్లే ఇదంతా..!
X

మాస్ మహరాజ్ రవితేజ లీడ్ రోల్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఈగల్. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. కొన్నాళ్లుగా ప్రచార చిత్రాలతో హడావిడి చేస్తున్న ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. అసలైతే సంక్రాంతి రేసులో నిలవాలని అనుకున్న ఈ సినిమా ఫైనల్ గా నిర్మాతల మండలి సూచనల మేరకు రిలీజ్ డేట్ మార్చుకుంది. ఫిబ్రవరి 9 పోటీగా వేరే ఒకటి రెండు సినిమాలు వస్తున్నా మొదటి ప్రియారిటీ బజ్ రవితేజ ఈగల్ కే ఉన్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు. చిత్ర యూనిట్ సమక్షంలోనే జరిగిన ఈ ఈవెంట్ లో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్వీట్ అండ్ షార్ట్ స్పీచ్ అతనిలోని కాన్ఫిడెన్స్ ని తెలిసేలా చేసింది. ఈ సినిమాకు పనిచేసిన వారందరి గురించి చూస్తున్నప్పుడు ఏంటి వీళ్లంతా నా సినిమాలో ఉన్నారా అనిపించింది. ఇదంతా కూడా ఒక్కడి వల్ల ఆ ఒక్కడే రవితేజ.

ఆయన ఛాన్స్ ఇవ్వడం వల్లే వీళ్లందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. సినిమాలో చాలా వరకు వెరైటీ సెట్ ఆఫ్ కాంబినేషన్స్ ట్రై చేశాం. ఇది బాగా వర్క్ అవుట్ అయినట్టే అని అనిపిస్తుంది. సినిమా అంతా బాగా వచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థాంక్స్ అని అన్నారు.

కార్తీక్ ఘట్టమనేని ఒక మంచి సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రఫీ చేస్తూనే తన మొదటి ప్రయత్నం గా సూర్య వర్సెస్ సూర్య డైరెక్ట్ చేశాడు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ రవితేజతో ఈగల్ సినిమా చేశాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రవితేజ మార్క్ మాస్ యాక్షన్ మూవీతో పాటుగా స్ట్రాంగ్ స్టోరీ తో ఈ మూవీ వస్తుందని తెలుస్తుంది. సినిమాలో అనుపమ, కావ్య తాపర్ ఫిమేల్ లీడ్స్ గా నటించారు.

ధమాకా తర్వాత రవితేజ మళ్లీ ఆడియన్స్ ని నిరాశ పరుస్తూ వచ్చారు. వాల్తేరు వీరయ్య హిట్ పడ్డా అది చిరు ఖాతాలో వెళ్లింది. అందుకే ఈగల్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా విషయంలో రవితేజ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.