Begin typing your search above and press return to search.

సన్నాఫ్‌ జక్కన్న.. తండ్రిలా స్లో కాదు

ఇప్పటికే ఏడాది పూర్తి అయ్యింది. మరో మూడు సంవత్సరాలు అయితే కానీ మహేష్‌ బాబు, జక్కన్న మూవీ వచ్చే పరిస్థితి లేదు

By:  Tupaki Desk   |   21 March 2024 6:33 AM GMT
సన్నాఫ్‌ జక్కన్న.. తండ్రిలా స్లో కాదు
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి కెరీర్ ఆరంభంలో కాస్త స్పీడ్ గా సినిమాలు తీశాడేమో కానీ ఇప్పుడు మాత్రం రెండు మూడు సంవత్సరాలు అంతకు మించి తీసుకుంటున్నాడు. గడచిన పదేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు మూడే మూడు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా కి ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఏడాది పూర్తి అయ్యింది. మరో మూడు సంవత్సరాలు అయితే కానీ మహేష్‌ బాబు, జక్కన్న మూవీ వచ్చే పరిస్థితి లేదు. రాజమౌళి మరీ ఇంత స్లోగా ఉంటే ఆయన తనయుడు కార్తికేయ మాత్రం చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నాడు.

గతంలోనే కార్తికేయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు దర్శకత్వం పై ఆసక్తి లేదు.. నిర్మాతగా పెద్ద సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. అన్నట్లుగానే నిర్మాతగా మంచి సినిమాలను లైన్ లో పెట్టాడు.

ఇటీవల మలయాళ హిట్ మూవీ ప్రేమలు ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు రెండు సినిమాలను ప్రకటించాడు. తన నిర్మాణంలో రాబోతున్న ఆ రెండు సినిమాలకు కూడా హీరోగా ఫహద్‌ ఫాజిల్ ను నటింపజేయడం విశేషం. ఒకే సారి రెండు సినిమాలు ప్రకటించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్న కార్తికేయ తన తండ్రి మాదిరిగా తాను స్లో కాదు అన్నట్టుగా చెప్పకనే చెబుతున్నాడు.

ఫహాద్‌ ఫాజిల్‌ హీరోగా ఆక్సీజన్ మరియు డోన్ట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ సినిమాలను కార్తికేయ నిర్మించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో శశాంక్‌ మరియు సిద్దార్థ్ నాదెల్ల లు దర్శకులుగా పరిచయం అవ్వబోతున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.