Begin typing your search above and press return to search.

అన్న‌య్య సినిమా కోసం అభిమానిలా హీరో!

'వాల్తేరు వీర‌య్య' విజ‌యంతో మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Jan 2024 7:28 AM GMT
అన్న‌య్య సినిమా కోసం అభిమానిలా హీరో!
X

'వాల్తేరు వీర‌య్య' విజ‌యంతో మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ స‌క్సెస్ ని మాత్రం చిరు త‌దుప‌రి కొన‌సాగించ లేక‌పోయారు. 'భోళా శంక‌ర్' రూపంలో భారీ డిజాస్ట‌ర్ ఎదుర వ్వ‌డంతో మ‌రోసారి విమర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. 'ఆచార్య' త‌ర్వాత మ‌రోసారి గొప్ప ప‌రాభావాన్ని అందించిన చిత్ర‌మ‌ది. అంత‌వ‌ర‌కూ ఎప్పుడు ట్రోలింగ్ కి గురి కాని మెగాస్టార్ సైతం తొలిసారి ఆ రెండు సినిమాల వైఫ‌ల్యాల కార‌ణంగా నెట్టింట ట్రోలింగ్ బారిన ప‌డ్డారు.

ఇది ప్ర‌తీ మెగా అభిమానిని ఎంతో నిరుత్సాహ ప‌రిచింది. చిరంజీవిపై ట్రోలింగ్ ఏంటి? అభిమానులంతా ఎంతో మ‌ద‌న‌ప‌డ్డారు. వాట‌న్నింటికి స‌మాధానంగా 'విశ్వంభ‌ర' చెబుతుంద‌ని ప్రేక్ష‌కాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. 'బింబిసార' ఫేం మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది. టైటిల్ ప్ర‌క‌ట‌న తోనే సినిమా పై అంచ‌నాలు తారా స్థాయిక చేరాయి. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత చిరు సోషియా ఫాంట‌సీ జోన‌ర్ లోకి అడుగు పెట్ట‌డంతో! అభిమానుల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది.

మెగాస్టార్ ఈ క‌థ‌ని..వ‌శిష్ట‌ని ఎంతో న‌మ్మి చేస్తోన్న చిత్ర‌మిది. తాజాగా ఈ సినిమా త‌ప్ప‌క విజ‌యం సాధించాల‌ని.. ఆ బాధ్య‌త మీమీదనే ఉంద‌ని మెగాస్టార్ అభిమానిగా వ‌షిష్ట‌కి సూచించాడు యంగ్ హీరో కార్తికేయ‌. ఈ యువ హీరో చిరుకి ఎంత వీరాభి మానో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న్ని స్పూర్తిగా తీసుకునే న‌ట‌న రంగంలోకి వ‌చ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకుంటున్నాడు.

తాజాగా ఓ వేడుక‌లో విశ్వ‌భ‌ర ద‌ర్శ‌కుడు..కార్తికేయ తారసప‌డ‌టంతో చిరంజీవి అభిమానిగా చెబుతున్నా....హిట్ ఇవ్వాల్సిన బాధ్య‌త మీద‌నే ఉంది. అభిమానుల‌మంతా ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నాను. విజ‌యం అందించాల‌ని ఎంతో రిక్వెస్ట్ గా చెబుతున్నా అంటూ మ‌రోసారి మెగాస్టార్ పై కార్తికేయ అభిమానం చాటుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.