కార్తికేయ గ్యాప్ ఎక్కువైంది..?
ఇయర్ లో రెండు మూడు సినిమాలు తీసే హీరోలు కొందరైతే.. 1, 2 ఇయర్స్ ఆగినా సరే ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలని వెయిట్ చేసే హీరోలు కొందరు
By: Tupaki Desk | 15 July 2025 8:00 AM ISTఇయర్ లో రెండు మూడు సినిమాలు తీసే హీరోలు కొందరైతే.. 1, 2 ఇయర్స్ ఆగినా సరే ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలని వెయిట్ చేసే హీరోలు కొందరు. ఐతే ఇండస్ట్రీకి ఇలాంటి ఇద్దరు హీరోలు అవసరమే. సక్సెస్ రేటు పెంచాలంటే రెండో పద్ధతి ఫాలో అవ్వాలి. ఐతే మొదటి కేటగిరిని ఫాలో అయినా ఎంచుకున్న కథ కథనాల మీద పూర్తి అవగాహనతో సెట్స్ మీదకు వెళ్లాలి. సో ఈ రెండు రకాల హీరోలకు సక్సెస్ అవసరమే కాబట్టి ఇద్దరు కష్టపడాలి.
ఐతే ఆరెక్స్ 100 కార్తికేయ రెండో కేటగిరీకి చెందిన హీరోగా కనిపిస్తున్నాడు. ముందు అతను కూడా వచ్చిన ప్రతి కథ ఓకే చెబుతూ సినిమాలు చేశాడు. కానీ వరుస ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో పడుతుందని గుర్తించిన అతను మెల్లగా మంచి కథ ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ కార్తికేయ బెదురులంక 2012, భజే వాయు వేగం సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు కార్తికేయ.
2023 లో బెదురులంక, 2024 లో భయే వాయు వేగం రెండు సినిమాలు తీసి రెండు సక్సెస్ అందుకున్నాడు. ఐతే కార్తికేయ నెక్స్ట్ సినిమా ఏంటంటే మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. హీరో దగ్గర నుంచి కూడా తన నెక్స్ట్ సినిమా అప్డేట్స్ ఏమి రావట్లేదు. భయే వాయు వేగం సినిమాను కూడా కార్తికేయ అంతా పూర్తై టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు. బహుశా కార్తికేయ నెక్స్ట్ సినిమాకు కూడా అదే ప్లానింగ్ లో ఉండొచ్చు.
ఏది ఏమైనా కార్తికేయ నెక్స్ట్ సినిమాకు మరీ లేట్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఒకరు గ్యాప్ ఇస్తే చాలు మరొక హీరో వచ్చి ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నాడు. అందుకే మరీ గ్యాప్ అయినా కూడా కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది. మరి కార్తికేయ ఈ విషయంలో ఎలా థింక్ చేస్తున్నాడు అన్నది చూడాలి.
కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తారు. కొన్నిసార్లు మాత్రమే లాజిక్, మ్యాజిక్ లాంటివి వర్క్ అవుట్ అవుతాయి. ఈ విషయాన్ని కెరీర్ లో త్వరగానే గుర్తించాడు కార్తికేయ. సో నెక్స్ట్ సినిమా కూడా ఒక పకడ్బందీ స్క్రిప్ట్ తోనే వచ్చే ఆలోచన ఉండొచ్చు. అందుకే తన సినిమా పట్ల ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా ఉన్నాడు.
