ఆరెక్స్ హీరో మరీ ఇంత గ్యాప్ ఎలా..?
ఆరెక్స్ 100 హీరో కార్తికేయ 2023 లో బెదురులంక, 24లో భజే వాయు వేగం సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 7 Jun 2025 3:59 AMఆరెక్స్ 100 హీరో కార్తికేయ 2023 లో బెదురులంక, 24లో భజే వాయు వేగం సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. రెండు హిట్లు కొట్టాక కూడా కార్తికేయ ఇంకా ఎందుకో డైలమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. కెరీర్ విషయంలో కాస్త టెన్షన్ అవసరమే కానీ అది ఫ్లాపులు పడిన టైం లో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ఆలోచనతో ప్లానింగ్ తో ఉండాలి. ఆల్రెడీ సక్సెస్ ఫాం లో ఉన్నప్పుడు లేట్ చేస్తే అది కాస్త రివర్స్ అవుతుంది. కార్తికేయ 2021 లో చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క సినిమాలు చేశాడు.
ఆ రెండు సినిమాలు అతనికి షాక్ ఇచ్చాయి. ఐతే ఆ తర్వాత కోలీవుడ్ లో అజిత్ కి విలన్ గా ఒక అటెంప్ట్ చేశాడు. కానీ అది అతని కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. ఫైనల్ గా బెదురులంక 2012 అంటూ ఒక ప్రాజెక్ట్ చేసి హిట్ కొట్టాడు. ఆ సినిమాతో కార్తికేయ కొత్త జోష్ ఏర్పరచుకున్నాడు. ఆ నెక్స్ట్ వెంటనే భజే వాయు వేగంతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు కార్తికేయ స్టోరీ సెలక్షన్ ఏంటన్నది తెలియచేశాయి.
ఐతే భజే వాయు వేగం వచ్చి ఏడాది అవుతుంది. కార్తికేయ నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నాడు అన్నది అసలు క్లారిటీ లేదు. సైలెంట్ గా ఏదైనా సినిమా చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఈసారి కూడా ఒక మంచి కథతో పక్కా ఆడియన్స్ ని మెప్పించే సినిమాతో వస్తాడని అంటున్నారు. ఐతే సినిమా ఆల్రెడీ చేస్తుంటే ఓకే కానీ ఇంకా కథల వేటలో ఉంటే మాత్రం కార్తికేయ వెనకపడినట్టే అవుతుంది.
సక్సెస్ ఫాం లో ఉన్నప్పుడు హిట్లు ఫ్లాపులు లెక్క చూడకుండా సినిమాలు చేస్తూ వెళ్లాలి. మరీ మార్కెట్ లేదు అనుకున్న టైం లో సొంత టాలెంట్ చూపించేలా సినిమాలు చేయాలి. మరి కార్తికేయకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు కానీ అతని సినిమాల వేగం మాత్రం తప్పకుండా పెంచాలి. యువ హీరోగా ఒక ఏడాదిలో రెండు సినిమాలు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం తన ప్లేస్ వెనక్కి జరుగుతూ ఉంటుంది. మరి ఈ పరిణామాలను కార్తికేయ గుర్తిస్తే బెటర్ అని చెప్పొచ్చు.