Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ బాక్సింగ్ ఛాంపియ‌న్ తో నే హీరో ఫైట్!

రియ‌ల్ బాక్స‌ర్ల‌ను రంగంలోకి దించ‌డం అంటే అంత ఈజీ కాదు. వాళ్ల‌ని వెతికి ప‌ట్టుకోవ‌డం ఎంత క‌ష్టంగా ఉంటుందో అలా ప్ర‌య‌త్నించిన వారికే తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 7:48 AM GMT
వ‌ర‌ల్డ్ బాక్సింగ్ ఛాంపియ‌న్ తో నే హీరో ఫైట్!
X

రియ‌ల్ బాక్స‌ర్ల‌ను రంగంలోకి దించ‌డం అంటే అంత ఈజీ కాదు. వాళ్ల‌ని వెతికి ప‌ట్టుకోవ‌డం ఎంత క‌ష్టంగా ఉంటుందో అలా ప్ర‌య‌త్నించిన వారికే తెలుస్తుంది. `లైగ‌ర్` చిత్రం కోసం డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ రియ‌ల్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ ని తెర‌పైకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఏకంగా రియ‌ల్ బాక్స‌ర్ తోనే పైట్ చేస్తాడు. ఆ సినిమా ప్లాప్ అయిన అందులో మైక్ టైస‌న్ ని చూడ‌టం మాత్రం అభిమానుల‌కు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన అంశం. టైసన్ కోసం సినిమాకెళ్లిన ప్ర‌త్యేక అభిమానులు ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో రియ‌ల్ బాక్సార్ ని రంగంలోకి దింపుతున్న‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా క‌బీర్ ఖాన్ స్టోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో `చందు ఛాంపియ‌న్` ఓ చిత్రాన్ని తెర‌కెక్కి స్తున్నారు. ఇందులో భార‌త్ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బాక్స‌ర్ పాత్ర‌లో కార్తిక్ క‌నిపించ‌బో తున్నాడు. ఈసంద‌ర్భంగా క‌బీర్ ఖాన్ కార్తీక్ కోసం ఏకంగా వ‌ర‌ల్డ్ బాక్స‌ర్ నే సీన్ లోకి తెచ్చేసారు.

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ సెనా ఆగ్బేకో ని రంగంలోకి దించారు. ఈ విష‌యాన్ని అధికారికంగానూ వెల్ల‌డించారు. ప్ర‌పంచ చాంపియ‌న్ తోనే కొట్టాడ‌బోతున్నా. రేపొద్దున జ‌రిగే పోరులో త‌న కోపాన్ని అంతా నాపై చూపించ బోతున్నాడు అంటూ కార్తీక్ పోస్ట్ చేసాడు. సెనా ఆగ్బే కో ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. సెనా ఆగ్బే పంచ్ ప‌డిందంటే ప్ర‌త్య‌ర్ధి లేవ‌డం అంత ఈజీ కాదు. ఎంతో మంది బాక్స‌ర్ల‌తో త‌లప‌డిన సెనా ఇప్పుడు బాలీవుడ్ న‌టుడితో త‌ల‌ప‌డ‌బోతున్నాడు.

మ‌రి ఆ ఫైట్ ఎంత రియ‌లిస్టిక్ గా ఉంటుంద‌న్నది చూడాలి. ప్ర‌స్తుతం ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పూరి మైక్ టైస‌న్ ని తెస్తే...క‌బీర్ ఖాన్ సెనాని తీసుకొచ్చాడు అంటూ అభిమానులు గుర్తు చేసుకుం టున్నారు.