Begin typing your search above and press return to search.

`మిరాయ్‌`తో అయినా మిరాకిల్స్ చేస్తాడా?

కెమెరామెన్స్ డైరెక్ట‌ర్స్‌గా మారి మిరాకిల్స్ చేసిన వారు కొంత మందే. ఆ జాబితాలో చేరాల‌ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు యండ్ సినిమాటోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని. `ప్రేమ ఇష్క్ కాద‌ల్‌` మూవీతో కెమెరామెన్‌గా కెరీర్ ప్రారంభించిన కార్తీక్ `కార్తికేయ‌` త‌రువాత `సూర్య వ‌ర్సెస్ సూర్య‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 4:00 PM IST
Cinematographer-Turned-Director Karthik Ghattamaneni Aims for Comeback with ‘Mirai’
X

కెమెరామెన్స్ డైరెక్ట‌ర్స్‌గా మారి మిరాకిల్స్ చేసిన వారు కొంత మందే. ఆ జాబితాలో చేరాల‌ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు యండ్ సినిమాటోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని. `ప్రేమ ఇష్క్ కాద‌ల్‌` మూవీతో కెమెరామెన్‌గా కెరీర్ ప్రారంభించిన కార్తీక్ `కార్తికేయ‌` త‌రువాత `సూర్య వ‌ర్సెస్ సూర్య‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు.

డైరెక్ట‌ర్ చందూ మొండేటి డైలాగ్స్ అందించి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌లేక‌పోయింది. టాప్ హిట్ సినిమాల‌తో బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీని అందించిన కార్తీక్ ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా చాటాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో కార్తీక్ చేసిన యాక్ష‌న్ డ్రామా `ఈగ‌ల్‌`. క‌న్ఫ్యూజ్ స్క్రీన్‌ప్లేతో చేసిన ఈ మూవీకి కార్తీక్ డైరెక్ట‌ర్‌, కెమెరామెన్‌, ఎడిట‌ర్ కూడా. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది.

అయినా స‌రే డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని టాలెంట్‌పై ఉన్న న‌మ్మ‌కంతో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ త‌న‌తో మ‌రో భారీ మూవీకి శ్రీ‌కారం చుట్టింది. అదే `మిరాయ్‌`. ఓ ఫాంట‌సీ స్టోరీతో భారీ హంగుల‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాపై కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. ఆగ‌స్టు 1న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. రితిక నాయ‌క్‌, శ్రియా శ‌ర‌న్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

జ‌య‌రామ్‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. `ఈగ‌ల్‌` మూవీతో భారీ డిజాస్ట‌ర్‌ని ఎదుర్కొన్న కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని `మిరాయ్‌`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని భావిస్తున్నాడు. టీజ‌ర్‌లో రివీల్ చేసిన అంశాలు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ సూప‌ర్ హీరో క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేనికి బిగ్ కంబ్యాక్ గా నిల‌వ‌డం ఖాయ‌మ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అంతా భావిస్తున్న‌ట్టే కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని `మిరాయ్‌`తో మిరాకిల్స్ చేస్తాడా? అన్న‌ది తెలియాలంటే ఆగ‌స్టు 1 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.