Begin typing your search above and press return to search.

వీడియో : 'జపాన్‌' కార్తీతో కొరియన్‌ సుమ

స్టార్‌ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌ లో సందడి అంతా ఇంతా ఉండటం లేదు

By:  Tupaki Desk   |   6 Nov 2023 1:28 PM GMT
వీడియో : జపాన్‌ కార్తీతో కొరియన్‌ సుమ
X

స్టార్‌ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌ లో సందడి అంతా ఇంతా ఉండటం లేదు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్ ను విభిన్నంగా చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తేనే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాల మేకర్స్ కూడా ప్రమోషన్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు.

ఈవారంలో కార్తీ హీరోగా నటించిన 'జపాన్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్ లో రూపొందిన ఈ సినిమాను అక్కడ భారీ ఎత్తున విడుదల చేస్తూ ఇక్కడ కూడా పెద్ద హీరోల సినిమాల రేంజ్‌ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జపాన్ సినిమా ను తెలుగు లో పెద్ద ఎత్తున కార్తీ అండ్ టీమ్ ప్రమోషన్ చేస్తున్నాయి.

వారంలో రెండు మూడు రోజులు హైదరాబాద్‌ లోనే కార్తీ అండ్‌ టీమ్‌ మకాం వేసి మరీ జపాన్ ను ప్రమోట్‌ చేయడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా సుమ తో కార్తీ మరియు హీరోయిన్‌ అను ఎమాన్యూల్‌ లు సరదా చిట్ చాట్‌ చేశారు. సుమ ఇంటర్వ్యూ అంటే రెగ్యులర్‌ ఇంటర్వ్యూల మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

సినిమాలో కార్తీ జపాన్‌ గా కనిపించబోతున్నాడు కనుక సుమ ఈ ఇంటర్వ్యూలో కొరియన్‌ అంటూ తనను తాను పరిచయం చేసుకుని ఫుల్‌ వినోదాన్ని పండించబోతుంది. రేపు ఫుల్‌ ఇంటర్వ్యూ రాబోతుంది. ఈ లోపుగా వచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సుమ మరియు కార్తీల యొక్క ఈ ఇంట్రాక్షన్ కచ్చితంగా యూట్యూబ్‌ లో తెగ వైరల్‌ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. మీరు ఈ ప్రోమోను చూసేయండి. మరి కొన్ని గంటల్లో ఫుల్‌ ఇంటర్వ్యూ రాబోతుంది.. అలాగే మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్‌ 10న దీపావళి కానుకగా జపాన్ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది.