Begin typing your search above and press return to search.

అక్క‌డ పోలీస్ కాంబోడియాలో స్పై!

కోలీవుడ్ హీరో కార్తీ వ‌రుస‌గా సీక్వెల్స్ ని ప‌ట్టాలెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఖైదీ-2..ఖాకీ-2 అంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించేసాడు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 11:30 AM GMT
అక్క‌డ పోలీస్ కాంబోడియాలో స్పై!
X

కోలీవుడ్ హీరో కార్తీ వ‌రుస‌గా సీక్వెల్స్ ని ప‌ట్టాలెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఖైదీ-2..ఖాకీ-2 అంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించేసాడు. ఇదే కోవ‌లో స‌ర్దార్ కి కూడా సీక్వెల్ చేస్తున్న‌ట్లు రివీల్ చేసారు. ఇందులో గుఢ‌చారిగా...పోలీస్ అధికారిగా కార్తీ ద్విపాత్రాభిన‌యం ఓ రేంజ్ లో అక‌ట్టుకుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కూ ప‌రుగులు పెట్టిస్తూనే ఉంటుంది. పి.ఎస్ మిత్ర‌న్ మేకింగ్ తో సినిమా ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమాకి కొన‌సాగింపుగా స‌ర్దార్ -2ని అధికారికంగా ప్ర‌క‌టించారు.


ఈసినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌యిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక రెండవ భాగాన్ని మ‌రింత ఆస‌క్తిగా మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది. పార్ట్ కోసం ఏకంగా కాంబోడియా దేశాన్ని షూటింగ్ స్పాట్ గా మలుచుకుంటున్నారు. కాంబోడియాలో గూఢ‌చ‌ర్యం చేసే భార‌తీయ ఏజెంట్ పాత్ర‌లో కార్తీ క‌నిపించ‌నున్నాడు. మొద‌టి భాగంలో పోలీస్ గాను చూపించిన మిత్ర‌న్ రెండ‌వ భాగంలో పూర్తిగా స్పైగా మార్చేస్తున్నారు.

కాంబోడియాలో ఈ పాత్ర‌ని ఎంతో సాహ‌సోపేతంగా మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్పై బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇటీవ‌లి కాలంలో మంచి విజ‌యాలు సాధిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో హిందీ సినిమాల్ని మించి సౌత్ మేక‌ర్స్ గొప్ప‌గా తెర‌కెక్కిస్తున్నారు. అందులోనూ తెలుగు..త‌మిళ్ ద‌ర్శ‌కులు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్నారు. సర్దార్ 2 ప్ర‌క‌ట‌న‌తో కార్తీ అభిమానుల్లో జోష్ నిండింది. స‌ర్దార్ త‌మిళ్ లో పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులోనూ మంచి పేరు ద‌క్కించుకుంది.

కాక‌పోతే ఇక్క‌డా సినిమాకి స‌రైన ప్ర‌చారం క‌ల్పించ‌క‌పోవ‌డంతో రీచ్ అవ్వ‌లేదు. కానీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న చిత్రంగా నిలిచింది. స‌ర్దార్ -2ని మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే కార్తీ న‌టించిన జ‌పాన్ భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.