Begin typing your search above and press return to search.

'హిట్ 4' హీరో క‌న్ఫ‌ర్మ్...నెట్టింట వీడియో వైర‌ల్‌

హిట్ యూనివ‌ర్స్‌కు ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌త ఉంది. ఈ సిరీస్‌లో వ‌చ్చిన రెండు సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డంతో `హిట్ 3`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 May 2025 12:48 PM IST
హిట్ 4 హీరో క‌న్ఫ‌ర్మ్...నెట్టింట వీడియో వైర‌ల్‌
X

హిట్ యూనివ‌ర్స్‌కు ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌త ఉంది. ఈ సిరీస్‌లో వ‌చ్చిన రెండు సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డంతో `హిట్ 3`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. హిట్ సిరీస్‌ల‌కు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించి ఆ సినిమాల విజ‌యాల్లో ఓ భూమిక పోషించిన నేచుర‌ల్ స్టార్ నాని తాజా `హిట్ ద థ‌ర్డ్ కేస్‌`లో న‌టించ‌డం తెలిసిందే. హిట్ సిరీస్‌లకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శైలేష్ కొల‌ను తాజా మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ గురువారం భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుద‌లైంది.

టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో అంచ‌నాల్ని పెంచేసిన హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్‌, ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా ఇప్ప‌టికే రికార్డులు సృష్టించిన `హిట్ 3` తొలి రోజే బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్‌గా నాని క్రేజ్ కార‌ణంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు, ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు చెబుతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీ‌నిధిశెట్టి హీరోయిన్ గా న‌టించిన ఈ ఈ మూవీలో కోలీవుడ్ హీరో కార్తీ అతిథి పాత్ర‌లో న‌టించాడ‌ని, హిట్ 2 ఎండింగ్‌లో నాని అర్జున్ స‌ర్కార్‌ల ఎంట్రీ ఇచ్చిన విధంగా కార్తి ఎంట్రీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే దీనిపై టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. కానీ కార్తి మాత్రం హిట్ 3లో న‌టించాడ‌ని మాత్రం ఎంతో కాలంగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ వైర‌ల్ అవుతోంది. `హిట్ 3` క్లైమాక్స్ ఎండింగ్‌లో కార్తీ క‌నిపించి త‌న‌దైన పంథాలో డైలాగ్ చెప్పిన తీరు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులో `ర‌త్న‌వేల్ కార్తి పాండియ‌న్‌` అనే ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీస‌ర్‌గా కార్తి క‌నిపించ‌బోతున్నాడు.

`దేశ‌మంటే మ‌ట్టికాదోయ్ మ‌నుషులోయ్‌` అంటూ శ్రీ‌గురజాడ అప్పారావు చెప్పిన క‌విత్వాన్ని కార్తి త‌న స్టైల్లో చెబుతూ ఎంట్రీ ఇచ్చిన తీరు ఆక‌ట్టుకుంటోంది. కార్తీ ఎంట్రీకి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీన్ని షేర్ చేస్తున్న నెటిజ‌న్‌లు అదిరింది అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. కార్తీ ఎంట్రీతో `హిట్ 4` హీరో ఎవ‌ర‌నే దానిపై క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో `హిట్ 4` మ‌రో లెవెల్‌లో ఉంటుంద‌ని, నాని ప్లానింగ్ మామూలుగా లేద‌ని నెటిజ‌న్‌లు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ కార్తీ వీడియోనే షేర్ చేస్తున్నారు.