Begin typing your search above and press return to search.

థియేటర్‌ నుంచి గెంటేశారు..!

తాజాగా తన బర్త్‌డే జరుపుకున్న కార్తీ మీడియా వారితో చిట్‌ చాట్‌ చేశాడు. తన కెరీర్‌ ఆరంభం నుంచి చేసిన సినిమాలు, అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   27 May 2025 3:00 AM IST
థియేటర్‌ నుంచి గెంటేశారు..!
X

తమిళ్‌ స్టార్‌ హీరో కార్తీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈయన నటించిన సర్దార్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే హిట్‌ ప్రాంచైజీలో నటించబోతున్నట్లు హింట్‌ ఇచ్చాడు. కార్తీ తమిళ్‌తో పాటు టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటాడు అనే విషయం తెల్సిందే. ఆయన సింప్లిసిటీకి చాలా మంది షాక్ అవుతూ ఉంటారు. ఇతర హీరోలతో కూడా నటించిన ఘనత దక్కించుకున్నాడు. తాజాగా కార్తీ ఒక ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజులను, ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు చేసిన అల్లరి పనుల గురించి చేసిన వ్యాఖ్యలు, చెప్పిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

రంగీలా సినిమాను ఎన్నో సార్లు చూసినట్లు చెప్పిన కార్తీ తన్హా తన్హా పాట కోసం మళ్లీ మళ్లీ థియేటర్‌కు వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఒక సారి రంగీలా సినిమాను చూడ్డం కోసం థియేటర్‌కి వెళ్లాం. ఆ సమయంలో టికెట్‌ తీసుకోకుండానే లోనికి వెళ్లాం. మేము వెళ్లే సమయంలో టికెట్‌లు తీసుకునే వారు ఎవరు లేకపోవడంతో ఈజీగానే లోనికి వెళ్లాం. ఆ తర్వాత మా వద్ద టికెట్లు లేవని గుర్తించి మమ్ములను థియేటర్‌ నుంచి గెంటివేశారు. మేము అంతా బయటకు వచ్చి మళ్లీ తదుపరి షో పడే వరకు వెయిట్‌ చేసి టికెట్లు కొనుగోలు చేసి ఏం తెలియనట్లుగా, ఏం జరగనట్టుగా సినిమాను చూశాము, అలా రంగీలా సినిమాను ఎన్నో సార్లు చూసినట్టు చెప్పుకొచ్చాడు.

కార్తీ గత ఏడాది సత్యం సుందరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాదిలో మరో సినిమాతో ఈయన రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల రాలేక పోయాడు. కానీ గత ఏడాదిలో కంగువా సినిమాలో గెస్ట్‌ గా కనిపించాడు. కంగువా సినిమా ప్లాప్‌ కావడంతో కార్తీ పాత్ర గురించి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కంగువా సినిమాలో కార్తీ పాత్ర విషయంలో పెద్దగా పేరు దక్కలేదు. కానీ హిట్‌ 3 లో కొన్ని నిమిషాలు నటించినా కూడా భలే ఉందే అంటూ కామెంట్‌ దక్కించుకున్నాడు. ఎప్పుడెప్పుడు హిట్‌ 4 సినిమా వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిట్‌ 3 సినిమాను చూసి బయటకు వస్తున్న అభిమానులు కార్తీ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.

తాజాగా తన బర్త్‌డే జరుపుకున్న కార్తీ మీడియా వారితో చిట్‌ చాట్‌ చేశాడు. తన కెరీర్‌ ఆరంభం నుంచి చేసిన సినిమాలు, అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సర్దార్‌ 2, కైతి 2 సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇదే ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో హిట్‌ 4 సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు బోర్డర్‌లో జరిగే కథతో హిట్‌ 4 సినిమా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కార్తీ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ను కలిగి ఉన్నాడు. ప్రతి సినిమా ద్విభాషా చిత్రంగా విడుదల అవుతున్నాయి. కనుక సర్దార్ 2 తో పాటు రాబోయే అన్ని సినిమాలు కూడా ద్వి భాష చిత్రాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.