Begin typing your search above and press return to search.

అన్నయ్యను ఫాలో కావచ్చుగా తమ్ముడు..!

సర్దార్‌ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత సోషల్‌ మీడియాలో కార్తీ మరింత ఎక్కువ ట్రోల్‌ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్తీ సినిమాల ఎంపిక విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   30 Sept 2026 5:00 PM IST
అన్నయ్యను ఫాలో కావచ్చుగా తమ్ముడు..!
X

తమిళ హీరో కార్తీ ఇటీవల 'సర్దార్‌ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. హిట్‌ సినిమా సీక్వెల్‌ కావడంతో కార్తీ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సర్దార్‌ 2 పై అంచనాలు పెంచుకున్నారు. తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే ఏమీ లేదు ఢొల్లా అన్నట్లుగానే లోపల ఉందని రివ్యూలు వచ్చాయి. కార్తీ ఎలా ఈ సినిమాను చేశాడు, దర్శకుడు ఏం అనుకుని సినిమాను తీశాడు, నిర్మాత ఎలా ఇంత ఖర్చు చేశాడు అంటూ తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. పైగా సినిమాకు పోటీ అన్నట్లుగా వచ్చిన 'మండాడి' సినిమా కి హిట్‌ టాక్ రావడంతో సర్దార్‌ 2 సినిమాను కనీసం జనాలు పట్టించుకోలేదు. దాంతో బాక్సాఫీస్‌ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. కార్తీ కెరీర్‌లోనే అతి చెత్త ఓపెనింగ్‌ సాధించిన మూవీగా సర్దార్‌ 2 సినిమా నిలిచింది అంటూ కొన్ని తమిళ సోషల్‌ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్‌లు పడ్డాయి.

సర్దార్‌ 2 తో ప్రేక్షకుల ముందుకు కార్తీ...

టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్న కార్తీ సినిమాలను ఎంపిక చేసుకుంటున్న విధానం ఏమాత్రం సరిగా లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. సర్దార్‌ ఎలాగూ సూపర్‌ హిట్‌ కనుక సీక్వెల్‌ కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని, మినిమం గ్యారెంటీ హిట్ అనుకున్నాడు. కానీ సినిమా ఫలితం చూస్తే తారు మారు అయింది. సినిమా బాక్సాఫీస్‌ వద్ద కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకు రాలేక పోయిందనే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇప్పుడు సర్దార్‌ 2 సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు లేదా అయిదు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కానీ సర్దార్‌ 2 ఫలితం నేపథ్యంలో కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. అంతకు ముందు కార్తీ నటించిన ఒక సినిమా కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అయిన విషయం తెల్సిందే.

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కార్తీ సినిమాల బిజినెస్‌...

సర్దార్‌ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత సోషల్‌ మీడియాలో కార్తీ మరింత ఎక్కువ ట్రోల్‌ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్తీ సినిమాల ఎంపిక విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు విభిన్నమైన, కొత్త కథలను ఎంపిక చేసుకున్న కార్తీ ఇప్పుడు ఎందుకు ఇలాంటి రొటీన్‌ కథలతో వస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం అన్న సూర్య కంటే బెటర్‌గా తమ్ముడు కార్తీ నుంచి సినిమాలు వస్తున్నాయని, తమిళ్‌, తెలుగులో మినిమం బిజినెస్‌, ఓపెనింగ్స్‌ రాబట్టగల సత్తా కేవలం కార్తీకే ఉందనే ప్రశంసలు దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్ అన్నట్లుగా అన్న సూర్య బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. కథ, దర్శకుడిపై నమ్మకం పెట్టి మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను చేస్తున్నాడు. కానీ కార్తీ మాత్రం హీరోయిజం అంటూ ఇంకా వెనుకనే ఉన్నాడు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

హీరో సూర్య వరుస విజయాలు...

హీరోయిజం, ఇమేజ్‌ వీటిని పక్కన పెట్టి ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. అలా తన ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన మూవీ 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'. తెలుగు దర్శకుడు చేసిన ఆ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. మిడిల్ ఏజ్ వ్యక్తి పాత్రలో సూర్య నటించిన విషయం తెల్సిందే. సూర్య తన హీరోయిజం ను చూపించాలి, ఎలివేషన్ కావాలని కోరుకోవడం లేదు. సింపుల్‌గా తన వద్దకు వచ్చిన మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, దర్శకుడు చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే ఆయనకు వరుసగా విజయాలు పడుతున్నాయి. కనుక కార్తీ సైతం తన అన్న సూర్యను ఫాలో అయ్యి, కథల విషయంలో తన ఇమేజ్‌ను పక్కన పెట్టి మరీ చూసుకుని, ఎంపిక చేసుకోవాలి అంటూ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొత్తగా సైన్ చేయబోతున్న సినిమా అయినా కాస్త కొత్తగా, ఇమేజ్‌ను పక్కన పెట్టి కార్తీ చేస్తాడా అనేది చూడాలి.