స్టార్ హీరో లైనప్ వెరీ క్లియర్.. 29, 30,31 లాక్డ్!
కోలీవుడ్ స్టార్ కార్తీ లైనప్ మామూలుగా లేదు. వరుస ప్రాజెక్ట్ లతో పుల్ బిజీగా ఉన్నాడు. స్టోరీలు విన్న ప్రాజెక్ట్ ల్ని ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 19 April 2025 10:30 AMకోలీవుడ్ స్టార్ కార్తీ లైనప్ మామూలుగా లేదు. వరుస ప్రాజెక్ట్ లతో పుల్ బిజీగా ఉన్నాడు. స్టోరీలు విన్న ప్రాజెక్ట్ ల్ని ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఓ సారి వాటి వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటికే కార్తీ హీరోగా `వా వాతి యారే` చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహించిన సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అయింది.
కార్తీ నుంచి రిలీజ్ అవుతున్న మరో యాక్షన్ కామెడీ డ్రామా చిత్రమిది. అలాగే స్పై థ్రిల్లర్ `సర్దార్ 2` చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. `సర్దార్` కి సీక్వెల్ గా పి. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెర కెక్కుతోన్న చిత్రంపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. స్పై థ్రిల్లర్ కావడంతో? ఇందులో కార్తీ ఎన్ని గెటప్స్ లో కనిపిస్తాడు? అన్న ఆసక్తి అందరిలో ఉంది. తెలుగులో ఈసినిమాకు ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అవుతుంది.
ఈ సినిమా ఇదే ఏడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు గాక కొత్త ప్రాజెక్ట్ లు కూడా లైన్ లో పెట్టాసాడు. `సర్దార్` సెట్స్ నుంచి బయటకు రాగానే `ఖైదీ 2` మొదలు పెడతాడు. ఎల్ సీ యూనుంచి రాబోతున్న చిత్రమిది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అలాగే 29వ చిత్రాన్ని తమిళ అనే కుర్రాడితో చేస్తున్నాడు. తాజాగా సుందర్. సి తో కూడా కార్తీ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు తెలిసింది.
ఇప్పటికే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని సమాచారం. `సర్దార్ 2` చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రిన్స్ పిక్చర్స్ సంస్థే ఈ కొత్త చిత్రాన్ని కూడా నిర్మిస్తుందని తెలిసింది. ప్రస్తుతం సుందర్. సి `మాకుత్తి అమ్మన్` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే కార్తీ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవుతాడు. ఇలా కార్తీ 29,30, 31 చిత్రాల లైనప్ క్లియర్ గా ఉంది.