Begin typing your search above and press return to search.

స్టార్ హీరో మార్ష‌ల్ రెండు భాగాలుగానా?

కోలీవుడ్ స్టార్ కార్తీ హిట్ సినిమాల సీక్వెల్స్ టార్గెట్ గా ప‌నిచేస్తున్నాడు. ఇప్ప‌టికే 'స‌ర్దార్' కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న 'స‌ర్దార్ 2' చిత్రం షూటింగ్ పూర్తి చేసాడు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 11:34 AM IST
స్టార్ హీరో మార్ష‌ల్ రెండు భాగాలుగానా?
X

కోలీవుడ్ స్టార్ కార్తీ హిట్ సినిమాల సీక్వెల్స్ టార్గెట్ గా ప‌నిచేస్తున్నాడు. ఇప్ప‌టికే 'స‌ర్దార్' కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న 'స‌ర్దార్ 2' చిత్రం షూటింగ్ పూర్తి చేసాడు. త‌దుప‌రి 'ఖైదీ 2' ప‌ట్టాలెక్కించ‌డానికి లోక‌ష్‌-కార్తీ ద్వయం రంగం సిద్దం చేస్తోంది. 'ఖైదీ'కి సీక్వెల్ గా ఎల్ సీయూ లో భాగంగా రూపొందుతున్న చిత్ర‌మిది. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం లోకేష్ కూలీ ప‌నుల్లో బిజీగా ఉన్నారు.

కార్తీ కూడా 'స‌ర్దార్ 2' డ‌బ్బింగ్ ప‌నుల్లోనూ బిజీగా ఉన్నారు. అయినా కార్తీ కొత్త చిత్రాల జోరు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికే త‌మిళ డైరెక్ట‌ర్ తో త‌న 29వ చిత్రాన్ని లాక్ చేసారు. డ్రీమ్ వారియ‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌డానికి రెడీ అవుతోంది. 'మార్ష‌ల్' టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివ‌ర‌ల్లో రెగ్యుల‌ర్ షూటింగ్ కి స‌న్నాహాలు చేస్తున్నారు.

తాజాగా అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం 'మార్ష‌ల్' కూడా రెండు భాగాలుగా తెర‌కెక్కించే ప్లాన్ చేస్తు న్నారు. ఇదొక డిఫ‌రెంట్ జాన‌ర్ చిత్రం. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా స‌ముద్రం నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ చిత్ర‌మిది. సీ బ్యాక్ డ్రాప్ లో ఇంత‌వ‌ర‌కూ కార్తీ సినిమాలు చేయ‌లేదు. ఇదే తొలి సినిమా కావ‌డంతో ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో పాత్ర కోసం కార్తీ కొంత ట్రైనింగ్ కూడా తీసుకుం టున్నాడుట‌.

ఇందులో అత‌డి ఆహార్యం రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఉంటుందం టున్నారు. హీరోయిన్ గా క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్ గా ఎంపికైంది. వ‌డివ‌లే కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. కార్తీ కెరీర్ లోనే ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా డ్రీమ్ వారియ‌ర్ రెడీ చేస్తోంది. బ‌డ్జెట్ 200 కోట్ల‌పైనే ఉంటుంద‌ని అంచ‌నా. ఇప్ప‌టికే డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ కార్తీ తో డిఫ‌రెంట్ సినిమాలు కొన్నింటిని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.