కార్తి కోసం రెండేళ్లు ఆగాల్సిందేనా..?
ఐతే ఇప్పుడు మాత్రం ఒక ప్లానింగ్ ప్రకారమే హిట్ 3 సినిమా చివర్లో కార్తి క్యామియో ప్లాన్ చేశారని అర్ధమవుతుంది.
By: Tupaki Desk | 10 May 2025 8:45 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో కార్తి ప్రస్తుతం సర్ధార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. దాంతో పాటుగా నెక్స్ట్ వా వాతియార్ సినిమాను కూడా లైన్ లో ఉంది. ఐతే ఈమధ్యనే నాని హిట్ 3లో క్యామియో రోల్ చేశాడు కార్తి. హిట్ 4లో కార్తి లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఐతే కార్తి హిట్ 4 ప్లాన్ ఎవరిదో కానీ అదిరిపోయింది. హిట్ యూనివర్స్ లో కార్తిని తీసుకు రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ రేంజ్ పెరిగింది. హిట్ 2 చివర్లో నాని గెస్ట్ రోల్ చేయడం నెక్స్ట్ హిట్ 3 హీరో నాని అవ్వడం అలా జరిగింది.
ఐతే ఇప్పుడు మాత్రం ఒక ప్లానింగ్ ప్రకారమే హిట్ 3 సినిమా చివర్లో కార్తి క్యామియో ప్లాన్ చేశారని అర్ధమవుతుంది. ఐతే హిట్ 4 లో కార్తి నటించడం దాదాపు ఓకే అని తెలుస్తున్నా అందుకు మాత్రం చాలా టైం పడుతుందని అంటున్నారు. ఎందుకంటే కార్తి చేతిలో ఇప్పుడు 3 సినిమాల దాకా ఉన్నాయి. సర్ధార్ 2 సినిమా పూర్తి కాబోతుంది. ఆ సినిమా తో పాటు వా వాతియార్ షూటింగ్ జరుగుతుంది.
ఇక కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు అన్నీ దాదాపు కార్తిని 2 నుంచి 3 ఏళ్లు బిజీగా మారేలా చేస్తాయి. సో హిట్ 4 లో కార్తి నటించాలంటే ఏదైనా సినిమా షూట్ గ్యాప్ లో దానికి అవకాశం ఇవ్వాలి లేదా కమిటైన సినిమాలన్నీ పూర్తయ్యాకే చేయాలి అంటే మాత్రం ఎలా లేదన్నా 3 ఏళ్లు వెయిట్ చేయాలి. మొత్తానికి హిట్ 4 లో కార్తి సర్ ప్రైజ్ ఆడియన్స్ ని ఖుషి చేసినా ఆ సినిమా వచ్చేందుకు మాత్రం చాలా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది.
అంతేకాదు కార్తి హిట్ 4 తో మరోసారి స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. హిట్ 1 నుంచి 3 వరకు చూస్తే మొదటి దాని కన్నా రెండోది.. రెండో దానికన్నా మూడోది స్థాయి పెరుగుతూ వచ్చాయి. అలా చూస్తే హిట్ 4 మరింత భారీగా ఉండే ఛాన్స్ ఉంది. నాని నిర్మాతగా కార్తి హీరోగా సినిమా అంటే ఆ లెక్క ఎలా ఉంటుందో చూడాలి. ఐతే హిట్ 4 మాత్రమేనా లేదా హిట్ యూనివర్స్ లో నెక్స్ట్ సినిమా కూడా తమిళ హీరోతోనే చేస్తారా అన్నది చూడాలి.