హిట్: దిఫోర్త్ కేస్ లో కార్తీ రోల్ ఇలా!
హిట్: `ది థర్డ్ కేస్` సక్సెస్ తో హిట్ ప్రాంచైంజీ బ్రాండ్ ఇమేజ్ అంత కంతకు రెట్టింపు అయింది. ఈసారి ఆ తాకిడి ఏకంగా పాన్ ఇండియాకే తాకింది.
By: Tupaki Desk | 4 May 2025 5:30 PMహిట్: `ది థర్డ్ కేస్` సక్సెస్ తో హిట్ ప్రాంచైంజీ బ్రాండ్ ఇమేజ్ అంత కంతకు రెట్టింపు అయింది. ఈసారి ఆ తాకిడి ఏకంగా పాన్ ఇండియాకే తాకింది. క్రైమ్ ఇన్వస్టిగేషన్ థ్రిల్లర్ కి ప్రేక్షకులకు బ్రహ్మరధం పడుతు న్నారు. దీంతో ఫోర్త్ కేస్ పై అంచనాలు అప్పుడే పీక్స్ కి చేరిపోతున్నాయి. ఫోర్త్ కేస్ లో హీరో ఎవరు? అన్నది ఇప్పటికే రివీల్ చేసారు. కోలీవుడ్ స్టార్ కార్తీని రంగంలోకి దించుతున్నారు.
ఇందులో కార్తీ మరో కొత్త కేస్ ఇన్వస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర ఎలా ఉంటుందన్నది థర్డ్ కేస్ లో రివీల్ చేసాడు. అయితే ఆ పాత్ర లోతును మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రోల్ ఎలా ఉంటుందన్నది శైలేష్ కొలను కొన్ని హింట్స్ ఇచ్చాడు. `తనకు క్రికెట్ అంటే ఇష్టం. బెట్టింగ్స్ కూడా వేస్తుంటాడు. ఆ పాత్ర కాస్త రూటెడ్ గానూ ఉంటుంది. కొంత ఫన్ టచ్ కూడా ఉంటుంది.
ఇంకా కార్తీకి పూర్తిగా కథ కూడా చెప్పలేదు. లైన్ ఏంటి? పాత్ర ఎలా ఉంటుందన్నది మాత్రమే చూపించాను. ఆయన దాన్ని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ఆనమ్మకాన్ని అంతే నిలబెట్టుకోవాలి` అన్నారు. శైలేష్ వ్యాఖ్యల్ని బట్టి `హిట్ ధి థర్డ్ కేస్` విధానంలోనే ఈ సినిమా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. `హిట్ 2` లో నాని రోల్ ని రివీల్ చేసినట్లే `హిట్ 3`లో కార్తీ రోల్ రివీల్ చేసారు. అప్పటికి థర్డ్ పార్ట్ స్టోరీ కూడా సిద్దం కాలేదు.
పాత్రని మాత్రమే పరిచయం చేసి వదిలేసారు. ఆ తర్వాత కథ రాయడానికి సమయం తీసుకుని మధ్యలో మరో సినిమా చేసి `హిట్ 3`ని పట్టాలెక్కించారు. ఇదే తరహాలో `హిట్ 4` కూడా రూపొందుతుందని తెలు స్తోంది. అయితే శైలేష్ కొలను తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడు? అన్నది ఇంత వరకూ రివీల్ చేయలేదు.