Begin typing your search above and press return to search.

కార్తీ లైన‌ప్ లో అన్ని సీక్వెల్సా?

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక సినిమాను స్టార్ట్ చేయ‌డం ఆ త‌ర్వాత లెంగ్త్ ఎక్కువైంద‌ని దాన్ని రెండు భాగాలుగా చేయ‌డం ఫ్యాష‌నైపోయింది.

By:  Tupaki Desk   |   12 May 2025 3:30 PM
Karthi Leads the Sequel Wave in Indian Cinema
X

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక సినిమాను స్టార్ట్ చేయ‌డం ఆ త‌ర్వాత లెంగ్త్ ఎక్కువైంద‌ని దాన్ని రెండు భాగాలుగా చేయ‌డం ఫ్యాష‌నైపోయింది. ఇలా చేయ‌డం వ‌ల్ల నిర్మాత‌ల‌కు కూడా బిజినెస్ జ‌రుగుతుండ‌టంతో వారు కూడా సీక్వెల్స్ కు సై అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ముందు సినిమా హిట్ అయితే సీక్వెల్ కు నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. అదే ఫ‌స్ట్ భాగ‌మే ఆడియ‌న్స్ ను మెప్పించ‌లేక‌పోతే వాటికి సీక్వెల్స్ చేయ‌డం ఎందుకులే అని లైట్ తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప‌లు ఇండ‌స్ట్రీల నుంచి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. అయితే వాటిలో ఎక్కువ సీక్వెల్స్ మాత్రం త‌మిళ హీరో కార్తీ అకౌంట్ లోనే ఉన్నాయి.

కార్తీకి త‌మిళంతో పాటూ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్ర‌తీ సినిమాకూ తానే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డంతో పాటూ తెలుగులో మాట్లాడుతూ ఆడియ‌న్స్ ను మెప్పించే కార్తీకి టాలీవుడ్ లో ఓ స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్ర‌స్తుతం కార్తీ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంటూ చేతిలోని సినిమాల‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు.

ఇండియ‌న్ సినిమాలో రానున్న ఎక్కువ సీక్వెల్స్ కార్తీ నుంచే రానున్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం కార్తీ స‌ర్దార్ సినిమాకు సీక్వెల్ గా స‌ర్దార్2 చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాంతో పాటూ అత‌ని లైన‌ప్ లో ఖైదీ2 కూడా ఉంది. వీటితో పాటూ ఖాకీకి సీక్వెల్ కూడా రానుందంటున్నారు. యుగానికి ఒక్క‌డు సీక్వెల్ లో కూడా కార్తీ న‌టించే అవ‌కాశ‌ముందంటున్నారు. అన్నీ బావుండి కంగువా2 తెర‌కెక్కితే అందులో కార్తీ ఉంటాడ‌ని స్పెష‌ల్ గా చెప్పే ప‌న్లేదు. కానీ కంగువ సినిమా భారీ డిజాస్ట‌ర్ అయిన నేప‌థ్యంలో కంగువ‌2 ఉండే ఛాన్స్ లేదు. వీట‌తో పాటూ రీసెంట్ గా హిట్3 క్లైమాక్స్ లో క‌నిపించి హిట్4లో తానే హీరో అని చెప్ప‌క‌నే చెప్పాడు కార్తీ. సో మొత్తానికి కార్తీ లైన‌ప్ లో ఎక్కువ‌గా సీక్వెల్సే ఉన్నాయ‌ని చెప్పొచ్చు.