Begin typing your search above and press return to search.

కార్తి హిట్ 4 ఇప్పుడు కాదా..?

నాని నటించిన హిట్ 3 చివర్లో హిట్ 4 హీరోని రివీల్ చేశాడు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా కార్తిని తీసుకు రావడం ఆడియన్స్ కి సూపర్ థ్రిల్ అనిపించింది

By:  Tupaki Desk   |   20 Jun 2025 8:30 AM IST
కార్తి హిట్ 4 ఇప్పుడు కాదా..?
X

నాని నటించిన హిట్ 3 చివర్లో హిట్ 4 హీరోని రివీల్ చేశాడు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా కార్తిని తీసుకు రావడం ఆడియన్స్ కి సూపర్ థ్రిల్ అనిపించింది. ఐతే ఆల్రెడీ ఇలాంటి క్రైం థ్రిల్లర్ సినిమా కెరీర్ స్టార్టింగ్ లోనే చేశాడు కార్తి. నా పేరు శివ అనే సినిమా కార్తి కెరీర్ లో మంచి సక్సెస్ ఫుల్ మూవీ. ఆ సినిమా క్రైం థ్రిల్లర్ సినిమాల్లో సంథింగ్ స్పెషల్ అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ కార్తి హిట్ 4 లో మరో క్రైం థ్రిల్లర్ కథతో రాబోతున్నారు. హిట్ 3 ఆఖర్లో ఆయన ఎంట్రీ ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇచ్చింది. ఇక తప్పకుండా హిట్ 4 లో కార్తి మార్క్ హంగామా ఉంటుందని చెప్పొచ్చు.

శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీని భాషతో సంబంధం లేకుండా విస్తరింపచేయాలని చూస్తున్నాడు. ఆ ప్లాన్ లో భాగంగానే హిట్ 4 లో కార్తిని సెలెక్ట్ చేశాడు. ఐతే హిట్ 4 కోసం కార్తి ఏదో ఒక రోజు షూట్ చేశాడు కానీ ఆ సినిమా పూర్తి చేయడానికి మాత్రం ఇప్పుడప్పుడే టైం ఇవ్వనని చెప్పాడట. ప్రస్తుతం కోలీవుడ్ లో సర్ధార్ 2 తో పాటు మరో రెండు భారీ ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టాడు కార్తి.

ఆ సినిమాలు పూర్తైన తర్వాతే హిట్ 4 కి డేట్స్ ఇస్తానని అన్నాడట. శైలేష్ కొలను కూడా హిట్ 4 ఇన్షియల్ ఐడియా మాత్రమే ఉండగా దాన్ని నానితో కార్తికి చెప్పించి ఒప్పించాడు. నాని చెప్పాడు కాబట్టే కార్తి చేసి ఉంటాడని చెప్పొచ్చు. ఐతే హిట్ 4 కన్నా ముందు కార్తి దాదాపు 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో సర్ధార్ 2, ఖైదీ 2 కూడా ఉన్నాయి.

హిట్ 4 సినిమా ఎలా లేదన్నా రెండేళ్ల తర్వాతనే మొదలయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. హిట్ 1, 2 సినిమాల కన్నా హిట్ 3 కమర్షియల్ గా ఎక్కువ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు శైలేష్ హిట్ 3 కన్నా హిట్ 4 ని మరింత భారీ సక్సెస్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. ఐతే ఈలోగా శైలేష్ మరో సినిమా చేయకుండా కేవలం హిట్ 4 సబ్జెక్ట్ మీదే వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే హిట్ 2 తర్వాత హిట్ 3 కి ముందు శైలేష్ చేసిన సైంధవ్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అందుకే హిట్ సీరీస్ లతోనే తన సత్తా చాటాలని చూస్తున్నాడు శైలేష్.