Begin typing your search above and press return to search.

ఆరేళ్ల క్రితం ఆగిన సినిమా టీజర్‌.. పట్టించుకోని హీరో

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఏవో కారణాల వల్ల షూటింగ్ దశలో ఆగిపోతాయి

By:  Tupaki Desk   |   25 Sep 2023 7:33 AM GMT
ఆరేళ్ల క్రితం ఆగిన సినిమా టీజర్‌.. పట్టించుకోని హీరో
X

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఏవో కారణాల వల్ల షూటింగ్ దశలో ఆగిపోతాయి. కొన్ని కనీసం షూటింగ్ కూడా ప్రారంభం అవ్వకుండా అటకెక్కుతాయి. కొన్ని మాత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత విడుదల అవ్వకుండా నిలిచి పోతాయి.

చిన్న హీరోల సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పెద్ద హీరోల సినిమాలు కూడా మధ్య లో ఆగిపోవడం.. విడుదల నిలిచి పోవడం వంటివి జరుగుతాయి. తమిళ్ స్టార్‌ హీరో విక్రమ్‌ తో ఆరు సంవత్సరాల క్రితం 'సూర్యపుత్ర కర్ణ' అనే భారీ పాన్ ఇండియా సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

షూటింగ్ కూడా కొంత భాగం పూర్తి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాను ఆపేశారు. హీరో విక్రమ్‌ కూడా సినిమా పై ఆసక్తి చూపించక పోవడంతో బ్యాలన్స్ షూటింగ్ అలాగే పెండ్డింగ్‌ లో ఉంటూ వస్తుంది. తాజాగా దర్శకుడు ఆర్‌ఎస్ విమల్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఆరేళ్ల క్రితం మధ్యలో ఆగిపోయిన సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సినిమాను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడా అనిపిస్తుంది. అయితే విక్రమ్‌ ఈ సినిమా ను పూర్తి చేసేందుకు ఆసక్తిగా లేడని తెలుస్తోంది.

టీజర్ విడుదల చేసినంత మాత్రాన విక్రమ్‌ వచ్చి సినిమాను ముగిస్తాడా అంటే అనుమానమే. అసలు టీజర్‌ విడుదల గురించి విక్రమ్‌ పట్టించుకోలేదు. కనీసం విక్రమ్‌ కి కర్ణ టీజర్‌ విడుదల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేది కూడా అనుమానం అన్నట్లుగా తమిళ్ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పబ్లిసిటీ మరియు సినిమా ను మార్కెట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు కర్ణ షూటింగ్ జరగకున్నా కూడా ఇలా టీజర్ ను విడుదల చేసి ఉంటాడు అనేది కొందరి మాట. అసలు విషయం ఏంటి అనేది ఆ దర్శకుడే చెప్పాలి.