Begin typing your search above and press return to search.

1933లోనే నాలుగు నిమిషాల లిప్‌లాక్‌ సీన్‌

ఇండియన్ సినిమాలో మొదటి ముద్దు సీన్ గా కర్మ సినిమాలో దేవికారాణి మరియు హిమాన్షు రాయ్‌ లు పెట్టిన ముద్దు సీన్‌ నిలుస్తుంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 3:30 PM GMT
1933లోనే నాలుగు నిమిషాల లిప్‌లాక్‌ సీన్‌
X

ఒకప్పుడు హాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అనుకున్న లిప్ లాక్‌ సన్నివేశాలు ఇప్పుడు ప్రాంతీయ భాష చిత్రాల్లో కూడా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఒకప్పుడు లిప్ లాక్ సన్నివేశం ఉంటే ఎక్కువగా మాట్లాడుకునే వారు.. ఇప్పుడు లిప్ లాక్‌ సన్నివేశం అనేది చాలా నార్మల్‌ విషయం. ముద్దు సన్నివేశం ఉండటం అనేది పరిపాటి అయింది.

ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ముద్దు సన్నివేశాలు కామన్ కానీ... పాతికేళ్ల ముందు వరకు ముద్దు సన్నివేశాలు అంటే చాలా చర్చ జరిగేది. ఇక అంతకు ముందు చిన్న ముద్దు సన్నివేశాన్ని కూడా రాద్దాంతం చేస్తూ విమర్శించిన వారు ఉన్నారు. అలాంటిది 1933 లోనే ముద్దు సీన్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇండియన్ సినిమాలో మొదటి ముద్దు సీన్ గా కర్మ సినిమాలో దేవికారాణి మరియు హిమాన్షు రాయ్‌ లు పెట్టిన ముద్దు సీన్‌ నిలుస్తుంది. స్వాతంత్య్రం కూడా రాని భారతంలో దేవికారాణి ముద్దు సన్నివేశంలో నటించి సాహసం చేసింది అనుకోవచ్చు. ఇలాంటి సన్నివేశాలను అప్పుడు కలలో కూడా ఊహించరు. అలాంటిది సినిమా లో కనిపించడం తో అంతా అవాక్కయ్యారు.

కర్మ సినిమాలో దేవికారాణి ముద్దు సీన్ లో నటించింది భర్త హిమాన్షు రాయ్ తో అవ్వడంతో కొందరు పర్వాలేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తే.. ఎంత భర్త అయితే మాత్రం నలుగురు చూస్తూ ఉండగా ఏంటి ఆ ముద్దులు అన్నట్లుగా కొందరు విమర్శించారు. కర్మ సినిమాలో ఈ భార్య భర్తలు ఏకంగా నాలుగు నిమిషాల పాటు అధర చుంబన సన్నివేశం లో కనిపించారు.