Begin typing your search above and press return to search.

వెడ్డింగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పై 'స్కూప్‌' న‌టి

కరిష్మా తన్నా టెలివిజన్ రంగం నుంచి వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌తిభావంత‌మైన‌ న‌టి. యూత్ అత్యంత ఇష్టపడే విజయవంతమైన నటీమణులలో ఒకరు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:35 AM GMT
వెడ్డింగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పై స్కూప్‌ న‌టి
X

కరిష్మా తన్నా టెలివిజన్ రంగం నుంచి వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌తిభావంత‌మైన‌ న‌టి. యూత్ అత్యంత ఇష్టపడే విజయవంతమైన నటీమణులలో ఒకరు. ఈ బ్యూటీ రెండు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉంది. చాలా కృషి అంకితభావంతో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తో హిందీ టీవీ రంగంలో అడుగుపెట్టింది. కహీ తో మిలేంగే, క్కోయి దిల్ మే హై మొదలైన షోలలో భాగమైంది. ఇటీవల `స్కూప్‌`లో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.


కరిష్మా తన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. విపరీతమైన అభిమానులను కలిగి ఉంది. ఇటీవల తాను వర్కౌట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి తన తీవ్రమైన గాయాల గురించి మాట్లాడింది. కానీ ఇప్పటికీ తన పనిని వదులుకోలేదు. ఆమె పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. నేను నా కోసం, నా కోసం పని చేస్తున్నాను. భుజానికి గాయం అయింది. మోకాలికి కూడా గాయం కానీ ప్రదర్శన తప్పక కొనసాగుతుంది... అని త‌న ప‌ట్టుద‌లను ఆవిష్క‌రించింది.


ఇంత‌లోనే ఇప్పుడు పాపుల‌ర్ వెడ్డింగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై క‌రిష్మా త‌న్నా ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. క‌రిష్మా త‌న్నా క‌వ‌ర్ గాళ్ అవ‌తారం పెప్పీగా ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ముదురు ఆకుప‌చ్చ బ్లౌజ్, కాంబినేష‌న్ ప‌రికిణీ దానికి త‌గ్గ‌ట్టు వ‌డ్డానం లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా స్ట్రైకింగ్ గా క‌నిపిస్తోంది. ఎంపిక చేసుకున్న ఆభ‌ర‌ణాలు ఈ డ్రెస్ తో మ్యాచ్ అయ్యాయి. ``CulturedWedding నవంబర్ కవర్‌ను అందిస్తోంది - ప్రేమ వేడుకలో సంప్రదాయం గ్లామర్‌ను కలుస్తుంది. ఇప్పుడు మ్యాజిక్‌ను ఆనందించండి`` అంటూ ఈ ఫోటోషూట్ కి క‌రిష్మా క్యాప్ష‌న్ ఇచ్చింది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కరిష్మా చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన `స్కూప్`లో కనిపించింది. OTT సిరీస్ లో జర్నలిస్ట్ జిగ్నా వోరా ర‌చ‌న‌, బెస్ట్ సెల్లర్ `బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా: మై డేస్ ఇన్ ప్రిజన్` ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడింది.