Begin typing your search above and press return to search.

మ‌ధ్యాహ్నం విమాన ప్ర‌మాదం.. ఇంత‌లోనే నిర్మాతకు గుండెపోటు!

ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థానాయిక‌ కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 11:14 AM IST
మ‌ధ్యాహ్నం విమాన ప్ర‌మాదం.. ఇంత‌లోనే నిర్మాతకు గుండెపోటు!
X

ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థానాయిక‌ కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. సంజయ్ ఒక వ్యాపారవేత్త. అత‌డు ప్రియా సచ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. అతడికి కరిష్మాతో ఇద్దరు పిల్లలు కాగా, ప్రియాతో మరొక వారసుడు ఉన్నారు.

సంజ‌య్ అక‌స్మాత్తుగా పోలో ఆడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన ఈరోజు తెల్లవారుజామున ఇంగ్లాండ్‌లో మరణించారు. ఈ సంద‌ర్భంగా ఆయన కుటుంబానికి సెల‌బ్రిటీలు తీవ్ర సంతాపం తెలియ‌జేస్తున్నారు. యాథృచ్ఛికంగా సంజయ్ కపూర్ చివరి సోషల్ మీడియా పోస్ట్ లో గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో మరణించిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. మ‌ధ్యాహ్నం ఈ ప్ర‌మాదం గురించి విన్నారు.. ఇంత‌లోనే ఆయ‌న గుండెపోటుకు గురి కావ‌డం విస్మ‌య‌ప‌రిచింది.

క‌పూర్ ప్ర‌స్తుతం పారిశ్రామిక‌వేత్త‌గా ఉత్త‌మ స్థానంలో ఉన్నారు. ఇటీవల ఆటోమోటివ్ సిస్టమ్స్ తయారీదారు సోనా కామ్‌స్టార్ చైర్మన్ గా ఉన్న‌ సంజయ్ కపూర్ .. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఉత్తర ప్రాంత ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు - చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ల‌డఖ్ -సీఐఐ ఉత్తర ప్రాంతాన్ని నడిపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

కానీ ఇంత‌లోనే ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌చి వేసింది. సంజ‌య్ మ‌ర‌ణ‌ వార్తల తరువాత, కరిష్మా కుటుంబం, స్నేహితులు ఆమె చుట్టూ గుమిగూడిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. సోదరి కరీనా కపూర్ త‌న అక్క మాజీ భ‌ర్త మ‌ర‌ణవార్త విన్న వెంట‌నే హుటాహుటీన త‌న సోద‌రి వ‌ద్ద‌కు చేరుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. మరిది సైఫ్ అలీ ఖాన్, సన్నిహితురాలు మలైకా అరోరా రాత్రి క‌రీనా ఇంటికి వెళ్లి ఓదార్పునిచ్చారు.

సంజయ్- కరిష్మా 2003 లో వివాహం చేసుకున్నారు. వారి విడాకులు జూన్ 2016 లో ఖరార‌య్యాయి. 2005 లో విడాకుల ప్ర‌క్రియ మొద‌లు కాగా సుదీర్ఘ కాలం కోర్టు కేసు కొన‌సాగింది. కరిష్మా 2010 లో ఢిల్లీలోని తన ఇంటి నుండి ముంబైకి వెళ్లింది. ఆ సమయంలో ఆమె చిన్న కుమారుడు కియాన్ జన్మించాడు. 2014 లో ఇద్దరూ తమ వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం దాఖలు చేశారు. సంజయ్ ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.