Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ కి సిస్ట‌ర్ గానా?

టాక్సిక్ అనేది తోబుట్టువ‌ల క‌థ అని...య‌శ్ సోద‌రి పాత్ర‌లోనే క‌రీనా న‌టిస్తుంద‌ని..జోడీగా కాదంటూ ఓ వార్త వైర‌ల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   27 March 2024 4:30 PM GMT
ఆ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ కి సిస్ట‌ర్  గానా?
X

పాన్ ఇండియా స్టార్ య‌శ్ 19వ చిత్రం గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌కత్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. 'టాక్సిక్' టైటిల్ తో దీన్ని పాన్ ఇండియాలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈసినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. టాక్సిక్ అనై టైటిల్ సైతం అంతే ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో య‌శ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ న‌టిస్తుం దంటూ ఓ ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

సౌత్ లో ఓ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు క‌రీనా కూడా రివీల్ చేయ‌డంతో విష‌యం దాదాపు క‌న్ప‌మ్ అయింది. య‌శ్ కి జోడీగానే ఫేమ‌స్ బ్యూటీని దించేస్తున్నార‌ని నాటి నుంచి ప్ర‌చారం ఠారెత్తి పోతుంది. దీంతో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అయిపోతున్నాయి. య‌శ్ లాంటి పాన్ ఇండియా స్టార్ స‌ర‌స‌న క‌రీనా లాంటి గ్లోబ‌ల్ ఫేం ఉన్న బ్యూటీ న‌టిస్తే? ఆ కాంబినేష‌న్ ని తెర‌పై చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోతాయా? అన్న రేంజ్ లో సీన్ ప్ర‌చారం పీక్స్ కి చేరింది.

అయితే ఇప్పుడా ప్ర‌చారం అంత‌కంత‌కు ప‌డిపోయే అప్ డేట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది. ఇందులో క‌రీనా న‌టించేది య‌శ్ కిజోడీగా కాదు..సిస్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుందంటూ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. టాక్సిక్ అనేది తోబుట్టువ‌ల క‌థ అని...య‌శ్ సోద‌రి పాత్ర‌లోనే క‌రీనా న‌టిస్తుంద‌ని..జోడీగా కాదంటూ ఓ వార్త వైర‌ల్ అవుతోంది. అక్కా-తమ్ముడు సెంటిమెంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా దీన్ని గీతూ మ‌లుస్తు న్న‌ట్లు వినిపిస్తుంది.

మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. ఇదే నిజ‌మైతే య‌శ్ కి హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది అంతే ఆసక్తి క‌రంగా మారుతుంది. య‌శ్ గ‌త సినిమా కేజీఎఫ్ లో హీరోయిన్ పేరుకే ఉంది త‌ప్ప‌. శ్రీనిధిశెట్టితో ఎలాంటి రొమాన్స్ లేదు. ఆమె పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. ఈ నేప‌థ్యంలో టాక్సిక్ లోనైనా గీతూ ఆ ఛాన్స్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి. ఈ నేప‌థ్యంలో హీరోయిన్ ఎవ‌రు? అవుతారు అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.